నల్లగొండ జిల్లా:నల్లగొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక( MLC elections )కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తరపున బుధవారం తీన్మార్ మల్లన్న టీం సభ్యులు నల్లగొండ కలెక్టరేట్ లో జిల్లా రిటర్నింగ్ అధికారిణి,కలెక్టర్ దాసరి హరిచందనకు 3వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్సీలు ఎన్నికల షెడ్యూల్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ షురూ అయిన మొదటి రోజే తీన్మార్ మల్లన్న కుటుంబ సభ్యులు మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయగా, ఈ నెల మూడున తీన్మార్ మల్లన్న నల్లగొండలో పార్టీ శ్రేణులు,పట్టభద్రులతో భారీ ర్యాలీ నిర్వహించి,తన కుటుంబ ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చి దేశ రాజకీయాల్లోనే సంచలన నిర్ణయంతో రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
నామినేషన్ అనంతరం తీన్మార్ మల్లన్న టీం సభ్యులు మాట్లడుతూ ఈ నెల 27 న జరగబోయే నల్లగొండ,ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమంది పోటీలో ఉన్నా తీన్మార్ మల్లన్న( Teenmar Mallanna) కనీవినీ ఎరుగని రీతిలో అఖండ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.పోటీలో ఉన్న ఏ అభ్యర్ధి కూడా మల్లన్న దరిదాపుల్లో లేరని, రాజకీయాలకు అతీతంగా ఈసారి పట్టభద్రులు మల్లన్నకు పట్టం కట్టబోతున్నారని, ఇప్పటికే వార్ వన్ సైడ్ అయిందని తెలిపారు.
మల్లన్న గెలుపుతోనే పట్టభద్రుల సమస్యలు చట్ట సభలో చర్చకు వస్తాయని,పరిష్కార మార్గం లభిస్తుందని విశ్వాసంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు.