నల్గొండ జిల్లా:దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన కపురతండా, మోదుగులకుంట గ్రామాల ఆర్ అండ్ ఆర్ బాధితులు తమకు ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాల గురించి శనివారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విన్నవించుకున్నారు.వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఉద్యోగ నియామకాల తేదీని ఖరారు చేసి,ప్రతి ఒక్క బాధితుడికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.




Latest Nalgonda News