తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )… ప్రస్తుతం చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఆయన సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.
ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపు అనేది సంపాదించుకున్నాడు.ఇక దాదాపు 45 సంవత్సరాలు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతుండటం విశేషం.
ఇక ఇదిలా ఉంటే ఈయన శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela )దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.అయితే ఈ సినిమా 2026వ సంవత్సరంలో సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కథ ఏంటి అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే దసర సినిమాలో( Dussehra ) మాస్ ఎలివేషన్స్ ఇస్తు యాక్షన్ ఎపిసోడ్స్ ను చాలా బాగా హ్యాండిల్ చేసిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలో కూడా తనదైన రీతిలో యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టి సినిమాని భారీ రేంజ్ లో సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…ఇక మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం ఆయన స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతాడు…
.