మానవ శరీరానికి తగిన మంచి ఆహారాలను తినకపోవడం, అలాగే పని ఒత్తిడి, అతిగా ఆలోచించడం వంటి కారణాల వల్ల మతిమరుపు వస్తుంది.మతిమరుపు వల్ల ఎంతో ఇబ్బంది పడతారు.
అయితే కొన్ని ఆహారాలు ఈ సమస్యను నివారించడం లో తోడ్పడతాయి.కొన్ని రకాల ఆహారాలు జ్ఞాపకశక్తిని బాగా పెంచుతాయి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ గా ఉండే ట్యూనా, సాల్మన్ వంటి చేపలను తరచుగా తింటే మతిమరుపు సమస్య దూరమవుతుంది.తాజా ఆకు కూరల్లో ఖనిజాలు, విటమిన్లు, ఫైబరర్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇందుకోసం పాలకూర, బచ్చలి కూర, బ్రోకలీ వంటి ఆకు కూరలను ఎక్కువగా తింటే, ఇవి మెమోరీ పవర్ ను పెంచుతాయి.మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.గుడ్లలో పోషకాలు పుష్కలం గా ఉంటాయి.రోజూ ఒక గుడ్డును తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
గుడ్లలో ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి.దీనిలో ఉండే కోలిన్ మెదడు పనితీరును మెరుపరుస్తుంది.
గింజలలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, కాల్షియం పుష్కలంగా ఉండే వాల్ నట్స్, గుమ్మడి గింజలు, బాదం పప్పులు తింటే మెదడుకు ప్రయోజనకరంగా ఉంటాయి.వీటిని తినడం వల్ల ఏ విషయాన్ని అయినా మర్చిపోయే సమస్యే ఉండదు.

పసుపు ఎన్నో అనారోగ్య సమస్యను తగ్గించడం లో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిరూపించబడింది.పసుపులో ఉండే కర్కుమిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.మెదడును యాక్టీవ్ గా చేస్తుంది.కొన్ని సుగంధద్రవ్యాలు, మూలికలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.అందువల్ల పైన పేర్కొన్న ఆహార పదార్థాలన్నీ మన రోజువారి జీవితంలో ఉండేలా చూసుకోవాలి.