నటులకు హావభావాలు చాల ముఖ్యం.ఎంత మంచి శరీర షౌష్ఠవం ఉన్నా, అందం ఉన్న కూడా నటన బాగాలేకపోతే మాత్రం వారు ఎక్కువ రోజుల పాటు సినిమా ఇండస్ట్రీ లో కొనసాగలేరు.
అందుకే కలర్, బాడీ తో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాల మంది నటులు, కమెడియన్స్( Comedians ) హీరోలుగా మారి సక్సెస్ అవుతున్నారు.ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటి అంటే టాలీవుడ్ లో చాలా ఏళ్ళ పాటు హీరోయిన్ గా నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగినప్పటికీ ఆమె కెరీర్ లో చేసిన ఒక ఛాలెంజింగ్ పాత్రకు సింగర్ సునీత( Singer Sunitha ) యొక్క హావభావాలను బట్టి నటించిందట.

అసలు సింగర్ సునీతకు అనుష్క( Anushka ) కు సంబంధం ఏంటి ? వీరిద్దరూ కలిసి ఏ సినిమాకు పని చేసారు ? ఎందుకు సునీత చేసినట్టు అనుష్క చేయాల్సి వచ్చింది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.విషయంలోకి వెళ్తే అనుష్క తన కెరీర్ లో అతి పెద్ద రిస్క్ చేసి నటించిన సినిమా వేదం.ఇందులో సరోజ అనే ఒక వేశ్య పాత్రలో అనుష్క నటించిన తీరు చూసి టాలీవుడ్( Tollywood ) తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ముక్కున వేలేసుకున్నారు.సరోజ( Saroja ) పాత్రలో ఆమె ఒంపులు, సొంపులు, వయ్యారాలు చూసి నిజమైన వేశ్యలు కూడా ఇంతలా చేయలేరేమో అనిపించే విధంగా ఆమె చేసింది.

మరి ముఖ్యంగా ఎగిరి పోతే ఎంత బాగుంటుంది అనే పాటలో అయితే అనుష్కను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.అయితే ఎగిరి పోతే ఎంత బాగుంటుంది అనే పాటలో తన ఎక్సప్రెషన్ మొత్తం కూడా సింగర్ సునీత ను చూసి చేసిందే అనే మాటా ఆ సినిమా ఆ దర్శకుడు క్రిష్ ( Krish )ఇటీవల కాలంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్తే తెలిసింది.నిజానికి ఎగిరి పోతే పాటను పాడింది సింగర్ సునీతనే కావడం విశేషం.ఆమె పాట రికార్డింగ్ జరుగుతున్న సమయంలో క్రిష్ అక్కడే ఉన్నారట.ఆ పాటలోని ఆ విరుపులు, శృంగార రసం తాలూకా వయ్యారం ఆమె గొంతులో రావాలంటే ఎంతో కొంత ఆమె మొహం లో కూడా ఆ బావాలు పలకాలి.సునీత పాడుతున్న సమయంలో ఆమె ఏ రకంగా అయితే ఎక్సప్రెషన్ ఇచ్చారో అవన్నీ కూడా కృష్ణ అనుష్క కు చెప్పి అలాగే చేయించారట.
ఎంత గమ్మత్తైన విషయం ఇది కదండి.