1.ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించిన ఈసీఐ
భారత ఎన్నికల సంఘం సోమవారం నుంచి ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇకపై రిజిస్టర్ రాజకీయ పార్టీలు తమ ఆర్థిక నివేదికలు , విరాళాలు నివేదికలు ఎన్నికల వ్యయ ఖాతాలతో సహా తమ ఆర్థిక నివేదికలను దాఖలు చేసేందుకు వీలుగా ఆన్లైన్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది.
2.సంజయ్ రౌత్ కామెంట్స్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ మారుతారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
3.తెలంగాణ ఇవ్వలేదు లాక్కున్నం
తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని , లాక్కున్నాం, గుంజుకున్నాం అని బిఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
4.మల్లు బట్టు విక్రమార్క కామెంట్స్
గిరిజనులు పడే బాధలు ఏంటో నా పాదయాత్రలో చూశానని సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) అన్నారు.
5.పెరగనున్న టాటా కార్ల ధరలు
టాటా కార్ల ధరలు ( Tata Motors )పెరగనున్నాయి మేరకు టాటా మోటార్స్ ప్రకటన విడుదల చేసింది.
6.కొత్త అంబులెన్స్ లను ప్రారంభించిన జగన్
146 కొత్త 108 అంబులెన్స్లను వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.
7.ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులు పాటు భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
8.కిక్కిరిసిన సింహాచలం
సింహాచలం పుణ్యక్షేత్రం గిరి ప్రదర్శనలతో కిక్కిరిసిపోయింది .ఆదివారం ప్రారంభమైన గిరి ప్రదక్షిణాలు ఈరోజు కొనసాగుతున్నాయి.
9.జగన్ సందేశం
అమెరికాలోని డల్లాస్ లో జరుగుతున్న నాటా తెలుగు సభలను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ సందేశం ఇచ్చారు.నా మీద చూపించిన ప్రేమ అభిమానం ఆప్యాయత నేను ఎప్పటికీ మర్చిపోలేను అని జగన్ సందేశం వినిపించారు.
10.జెసి కామెంట్స్
తాడిపత్రి సీఐ ఆనందరావు ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై అనంతపురం మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి స్పందించారు.రాజకీయ ఒత్తిడితోనే సిఐ ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రభాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
11.కాంగ్రెస్ లోకి షర్మిల : కెవిపి
త్వరలోనే కాంగ్రెస్లోకి షర్మిల వస్తారని, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావు అన్నారు.
12.నారా లోకేష్ హామీలు
టిడిపి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేవరకు యువ గళం నిధి కింద నిరుద్యోగ యువత ఒక్కొక్కరికి మూడు వేలు పెన్షన్ అందిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
13.లోకేష్ కు రజిని సవాల్
ఆరోగ్యశ్రీ పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు దమ్ముంటే తనతో చర్చకు రావాలని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని సవాల్ చేశారు.
14.రాహుల్ గాంధీ పై కేటీఆర్ విమర్శలు
స్కాములతో దేశాన్ని బ్రష్టు పట్టించారని ఆస్కాములే త్రాచుపాములుగా మారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను మింగేసాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
15.ప్రగతి భవన్ వద్ద కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రగతి భవన్ వద్ద హల్ చల్ చేశారు.కేసీఆర్ ను కలిసేందుకు వచ్చానని తనను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారంటూ ఆయన తనదైన శైలిలో మండిపడ్డారు.
16.గవర్నర్ ఆకస్మిక తనిఖి
తెలంగాణ గవర్నర్ కమల సాయి ఈరోజు ఉస్మానియా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు .ఈ సందర్భంగా బ్లాక్ ఉస్మానియా పురాతన భవనాన్ని పరిశీలించారు.
17.కెసిఆర్ పై జీవన్ రెడ్డి విమర్శలు
కెసిఆర్( CM KCR ) అవినీతిని వెలికి తీసి బోన్ లో నిలబెడతామని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం పై అనేక విమర్శలు చేశారు.
18.చలో ఢిల్లీకి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపు
ఈనెల 28న చలో ఢిల్లీ కార్యక్రమానికి రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.నీళ్లు నిధులు నియామకాలు సమాన వాటా కోసం ఈనెల 28న ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
19.పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
భారతీయులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్ చేశారు.