ఏపీ ఎన్నికల సమయంలో టిడిపి, జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి ప్రధానంగా ఇచ్చిన ఎన్నికల హామీలలో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి.ఇప్పటికే తెలంగాణ , కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది.
కర్ణాటక , తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Karnataka , Telangana assembly election ) కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణ హామీ పై మహిళలు బాగా ఆకర్షితులవడం, ఆ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, ఏపీలోనూ ఆ పథకాన్ని అమలు చేస్తామని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.అయితే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి చాలా నెలలే అవుతున్నా, ఆ పథకం ఇంకా అమలు చేయడం లేదు.
ఇప్పటికే ఏపీ ఆర్టీసీ అధికారులు కర్ణాటక, తెలంగాణలలో ఉచిత బస్సు ప్రయాణ అమలవుతున్న తీరు, ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించి వచ్చారు.
![Telugu Ap, Menifesto, Bus, Bus Travel, Rtc Bus-Politics Telugu Ap, Menifesto, Bus, Bus Travel, Rtc Bus-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/12/Is-there-no-free-bus-travel-nowc.jpg)
ఇక వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు భావించారు.ఇప్పటికే ఈ హామీ అమలు చేయడం ఆలస్యమైందని ,మహిళల్లో వ్యతిరేకత మొదలవుతుందని భావించే ఈ సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించాలని భావించారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని భావించి మరి కొంతకాలం వేచి చూస్తే మంచిదనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.
మరో నెల రోజుల్లోనే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది.అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే పథకాన్ని ప్రారంభిస్తే అనుకూలత కంటే వ్యతిరేకితే ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇప్పటికే కర్ణాటక , తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది.
![Telugu Ap, Menifesto, Bus, Bus Travel, Rtc Bus-Politics Telugu Ap, Menifesto, Bus, Bus Travel, Rtc Bus-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/12/Is-there-no-free-bus-travel-nowd.jpg)
కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ( Free bus travel )అమలు చేసిన తర్వాత ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడటం, పురుషుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడం, తమకు బస్సుల్లో కూర్చునే అవకావ్యక్తంపోవడం వంటి వాటితో వారిలో వ్యతిరేకత వ్యక్తం అవడం, హడావుడిగా ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించినా, తగినన్ని బస్సులు లేకపోవడం, దీంతో పాటు ఆటో కార్మికుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొంత కాలం ఈ పథకం అమలు తీరుపై కసరత్తు చేసి , ఆ తరువాతనే ఈ పథకాన్ని ప్రారంభించే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.