అధిక బరువు, రక్తహీనత.ఇటీవల రోజుల్లో అధిక శాతం మందిని వేధిస్తున్న సమస్యలు ఇవి.అందులోనూ మహిళలు ఈ సమస్యలను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే వాటి నుంచి బయట పడటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
మందులు వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే స్మూతీని తీసుకుంటే ఆ రెండు సమస్యలను సులభంగా నివారించుకోవచ్చు.
అవును అధిక బరువును తగ్గించడమే కాదు రక్తహీనతను తరిమికొట్టడంలోనూ ఈ స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక క్యారెట్‌ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు స్పూన్ అశ్వగంధ పొడి, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాస్ హోం మేడ్ బాదం పాలు, పావు స్పూన్ డ్రై జింజర్ పౌడర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టర్మరిక్ క్యారెట్ స్మూతీ సిద్దం అవుతుంది.

సూపర్ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఈ స్మూతీ ఎంతో మేలు చేస్తుంది.ఈ స్మూతీని రోజుకు ఒక గ్లాసు చొప్పున ప్రతి రోజు తీసుకుంటే రక్తహీనత సమస్య పరార్ అవుతుంది.అలాగే అతి ఆకలి తగ్గి మెటబాలిజం రేటు పెరుగుతుంది.దీంతో వేగంగా బరువు తగ్గుతారు.అంతేకాదు ఈ టర్మరిక్ క్యారెట్ స్మూతీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.మెదడు రెట్టింపు వేగంతో పని చేస్తుంది.
మరియు కంటి సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా దూరం అవుతాయి.