ఆరోగ్యంగా, ఫీట్‌గా మరియు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలని అందరూ కోరుకుంటారు.కానీ, ప్రస్తుత వేసవి కాలంలో మండే ఎండల్లో అలా ఉండటం చాలా మందికి అసాధ్యంగా మారుతుంటుంది.
అయితే వాస్తవానికి పలు ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే కాలం ఏదైనా ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.ముఖ్యంగా అందుకు ఇప్పుడు చెప్పబోయే మిల్క్ షేక్ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంతకీ ఆ మిల్క్ షేక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బ్లెండర్ తీసుకుని.
అందులో పదిహేను పిస్తా పప్పులు, నాలుగు జీడిపప్పులు, అర కప్పు అరటి పండు స్లైసెస్, మూడు గింజ తొలగించిన కర్జూరాలు, ఒకటిన్నర గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా పిస్తా మిల్క్ షేక్ సిద్ధం అవుతుంది.
సూపర్ టేస్టీగా ఉండే ఈ పిస్తా మిల్క్ షేక్ ను డైరెక్ట్‌గా తాగేయవచ్చు.లేదా ఒక ముప్పై నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని కూడా తీసుకోవచ్చు.వారంలో మూడంటే మూడు సార్లు ఈ పిస్తా మిల్క్‌ను తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దాంతో గుండె సంబంధిత వ్యాధులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
ఎముకలు దృఢంగా మారతాయి.కండరాల నిర్మాణం పెరుగుతుంది.

ఒత్తిడి, మానసిక ఆందోళన వంటివి దూరం అవుతాయి.శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.మెదడు షార్ప్‌గా పని చేస్తుంది.నీరసం, అలసట వంటివి దరి చేరకుండా ఉంటాయి.రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.మరియు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.
కాబట్టి, హెల్త్‌కు మేలు చేసే పిస్తా మిల్క్ షేక్‌ను తప్పకుండా డైట్‌లో చేర్చుకోండి.