మీ అతి తగలెయ్య.. సిగిరెట్ ను ఈఎంఐలో అమ్మడమేంటి? వీడియో వైరల్

ఈఎంఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్) అనే పదం ఇప్పుడు ప్రతి వస్తువుకు ఉపయోగించే పదంగా మారిపోయింది.మొబైల్ ఫోన్లు, కార్లు, ఇళ్ళు, ఫర్నిచర్, ఇలాక్ట్రానిక్స్ ఇలా చిన్నా పెద్దా ఏ వస్తువైనా ఈఎంఐ పథకంలో దొరుకుతుండడం నేటి సమాజంలో సాధారణ విషయంగా మారిపోయింది.

 Viral Video Shows Man Selling Cigarettes On Emi Satirical Take On Modern Consume-TeluguStop.com

అయితే, ఈ ఆఫర్లు వినిపించేవరకు గమ్మత్తుగా ఉన్నా, నెల నెలా వాయిదాల చెల్లింపుల్లో ప్రజలు పడే పాట్లు మాత్రం వేరే లెవెల్ లో ఉంటాయి.ఈ నేపథ్యంలోనే, ఒక యువకుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా క్రియేటివ్ కామెడీ వీడియోతో ఈ ఈఎంఐ( EMI ) వ్యవస్థపై ఓ విపరీతమైన వ్యంగ్యాన్ని చూపిస్తూ వైరల్ అయ్యాడు.

ఇప్పటికే వినిపించిన ఈఎంఐ స్కీమ్‌లకు భిన్నంగా, ఈ యువకుడు సిగరెట్‌ను( Cigarette ) కూడా ఈఎంఐలో విక్రయిస్తున్నట్లు తన వీడియోలో చూపించాడు.“నాలుగు రూపాయల డౌన్‌పేమెంట్ తో సిగరెట్ అందిస్తాను, నెలకు ఒక్కో రూపాయిగా ఈఎంఐ చెల్లించండి” అని కస్టమర్‌తో మాట్లాడుతున్నట్లు ప్రాంక్ వీడియోను రూపొందించాడు.అంతే కాదు, “సిగరెట్ కొన్న వారికి ఉచితంగా వక్క పొడి ప్యాకెట్ బహుమతిగా” ఇస్తున్నట్లు చెబుతాడు.ఈ ప్రదేశానికి 80 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన యువకుడు ఒక్క సిగరెట్ కోసం చేసిన ప్రయాణం వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వీడియో ఒక పక్కగా వినోదాన్ని అందించినా, మరోవైపు నేటి ఈఎంఐ సంస్కృతి మీద గట్టి వ్యాఖ్యను కూడా చేసింది.ప్రతిదానికీ ఈఎంఐ పెట్టే కాలంలో, అత్యంత చెడ్డ అలవాటైన సిగరెట్‌కి కూడా ఈ విధమైన వ్యవస్థని చూపించి, నేటి వినియోగ సంస్కృతిని చమత్కారంగా ఎత్తిచూపారు.నెటిజన్లు ఈ వీడియోపై విపరీతంగా స్పందిస్తున్నారు.అందులో కొందరు వారి కామెడీని అభినందిస్తుంటే.మరికొందరు ఫన్నీ ఎమోజిలతో కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలశ్యం ఈ క్రియేటివ్ కాంటెంట్‌కి ఓ లుక్ వేసేయండి.

ఏమి అనిపించిందో ఓ కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube