ఏప్రిల్ నెలలో గంగా నది పుష్కరాలు మొదలు.. ఏఏ ప్రాంతాల్లో జరుగుతాయంటే..!

సనాతన ధర్మంలో మన దేశంలో ఉన్న నదులకు ( Rivers ) ఎంతో విశిష్టత ఉంది.నదులను చాలా మంది ప్రజలు పవిత్రంగా భావించి పూజిస్తారు.

 Ganga River Pushkaralu Starting In The Month Of April And Places Details, Ganga-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో గంగా నదికి( Ganga River ) ఎంతో ప్రాముఖ్యత ఉంది.గంగా నదిని గంగమ్మ తల్లి, పావన గంగా, గంగాభవాని అని పిలుస్తారు.

అలాంటి పవిత్ర గంగా నది పుష్కరాలు( Ganga Pushkar ) ఏప్రిల్ 22వ తేదీన మొదలవుతున్నాయి.పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని అర్థం.

గంగా పుష్కరాలు బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు ఏప్రిల్ 22న మొదలవుతాయి.

మళ్లీ బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు మే మూడో తేదీన ముగుస్తాయి.

గంగా పుష్కరాలు అలహాబాద్, గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్‌నాథ్ సంగం ప్రయాగ నగరాల్లో జరగనున్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పెద్ద పండుగ పుష్కరాలకు గంగానది ముస్తాబవుతుంది.

పుష్కరాలు జరిగే ఈ 12 రోజులు గంగానది తీర ప్రాంతాలైన గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్నాథ్, వారణాసి, అలహాబాద్ క్షేత్రాలు పుష్కర శోభను సంతరించుకుంటాయి.

పవిత్ర గంగానదిలో స్నానం చేయడం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో పవిత్ర క్షేత్రాలు రద్దీగా మారుతాయి.బృహస్పతి సంవత్సరానికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు.ఆ మేరకు బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన మొదటి 12 రోజులను ఆది పుష్కరాలుగా, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా వేడుకలు నిర్వహిస్తారు.

పుష్కర సమయంలో బ్రహ్మది దేవతలంతా పుష్కరునితో సహా నది జలలోకి ప్రవేశిస్తారు.ఆ నీటిలో స్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయని, అంతేకాకుండా అక్కడ పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్య లోకాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రతి రోజు దాదాపు 25 లక్షల మంది భక్తులు గంగ నదిలో స్నానం చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube