God worship : పగిలిపోయిన దేవుని పటాలకు పూజలు చేస్తే ఇంటికి మంచిది కాదా..

దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా మన దేశ ప్రజల ఇళ్లలో చాలామంది పూజ గదిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.ఆ పూజ గదిలో ఎక్కువగా దేవుని పటాలను, కొన్ని దేవుని విగ్రహాలను ఉంచి పూజలు చేస్తూ ఉంటారు.

 Isn't It Good For The House To Worship Broken Images Of God, Worship, God, Devot-TeluguStop.com

కానీ ఇలా పూజ గదిలో ఎక్కువ దేవుని ఫోటోలను ఉంచకూడదు.అయితే దేవుని పూజ చేయాలి అనుకున్నవారు రోజుల్లో కనీసం 40 నిమిషాలు పూజ చేస్తే సరిపోతుందట.

ఎప్పుడైనా సరే పూజ చేసిన తర్వాతే పనులన్నీ చేసుకోవడం మంచిదని వేద పండితులు చెబుతున్నారు.

భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా పని చేసుకుంటేనే మంచిదని అది పూజ చేసిన తర్వాత చేస్తే ఇంకా మంచిదని వేద పండితులు చెబుతున్నారు.

అప్పుడే పని మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్మకం.దానివల్ల ఆ భగవంతుని చల్లని చూపు తమపై ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

అలాగే పూజ గదిలో కొన్ని రకాల దేవుడి పటాలను అస్సలు ఉంచకూడదు.కొంతమంది ఇంట్ల లలో భగవంతుని పటాలు వంగిపోవడం, బూజు పట్టడం, లేదంటే అద్దాలు పగిలి పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

అటువంటి దేవుడి పటాలను ఎప్పుడూ ఇంట్లోని పూజ గదిలో ఉంచి పూజ అసలు చేయకూడదు.

Telugu Bhakti, Broken God, Devotional, Pooja-Latest News - Telugu

ఒకవేళ పూజను అలాగే విరిగిపోయిన పటాలతో పూజ చేయడం వల్ల పూజ చేసిన వారికి ఫలితం దక్కదు.అంతేకాకుండా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది.ఇంట్లో పగిలిన దేవుని ఫోటోలు ఉంటే ఆ ఫోటోలను వెంటనే ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయడం మంచిది.

పగిలిన దేవుడి ఫోటోలను ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం వల్ల కీడు జరిగే అవకాశం ఉంది.అలాగే చాలామంది ఇంట్లో విరిగిపోయిన విగ్రహాలను కూడా ఉంచుకోవడం మంచిది కాదు.

అలా చేయడం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube