ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో వచ్చే మొదటి చంద్రగ్రహణం( lunar eclipse ) ఇదే అని పండితులు చెబుతున్నారు.మొదటి చంద్రగ్రహణం ఈరోజు రాత్రి 8 గంటల 44 నిమిషాలకు మొదలవుతుంది.
ఈసారి అరుదైన పెనుంబ్రల్ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.మాములుగా చెప్పాలంటే భూమి, చంద్రుడు మధ్య సూర్యుడు వచ్చినప్పుడు చంద్రుని నీడ భూమి మీద పడదు.
ఇలా ఏర్పడిన చంద్ర గ్రహణాన్ని ఎవరైనా నేరుగా చూడవచ్చు.చంద్రగ్రహణాన్ని నేరుగా చూడడం వల్ల ఎలాంటి హాని ఉండదు.
ఏదైనా గ్రహణాలు ఏర్పడినప్పుడు గ్రహణానికి ముందు ఉండే కాలాన్ని సుతక కాలం అని అంటారు.సహజంగా సుతకా కాలాన్ని అశుభ కాలంగా పరిగణిస్తారు.
సూతక కాలంలో కూడా కొన్ని పాటించాల్సిన నియమాలు ఉన్నాయని పెద్దవారు చెబుతూ ఉంటారు.అంతేకాకుండా గ్రహాల కదలికలు, ఖగోళంలో సంభవించే మార్పులు, గ్రహణాలు మనుషుల ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతాయి.

ఈ గ్రహణం ఎక్కువగా గర్భిణీ స్త్రీలపై( pregnant women ) చాలా దుష్ప్రభావాలను చూపించే అవకాశం ఉందని పెద్దవారు చెబుతున్నారు.అందుకే గర్భిణీ మహిళలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.ఈరోజు 8.44 నిమిషాల నుంచి గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.ఒకవేళ బాగా ఆకలి అనిపిస్తే పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవడం మంచిది.చంద్రగ్రహణ సమయంలో ఎటువంటి పనులను కూడా చేయకూడదు.పదునైన వస్తువులను అసలు ముట్టుకోకూడదు.అలాగే గురువేచ్చని నీటిని మాత్రమే తాగాలి.
ముఖ్యంగా చెప్పాలంటే కూరగాయలు కట్ చేయడం వంటి పనులను అస్సలు చేయకూడదు.అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు గ్రహణా సమయంలో స్నానం కూడా చేయకూడదు.
ఒక మాటల్లో చెప్పాలంటే ఎటువంటి పనిచేయకుండా ఉండడమే మంచిది.గ్రహణం విడిచిన తర్వాత తప్పకుండా గర్భిణీ స్త్రీలు స్నానం చేయాలి.
ఈ నియమాలను పాటించడం వల్ల గర్భిణీ స్త్రీలు గ్రహణా సమయంలో వచ్చే దుష్ప్రభావాల నుంచి తమను, తమ బిడ్డను కాపాడుకోవచ్చు.