1.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1938 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.ఏపీ శాసన మండలి నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ శాసనమండలి నుంచి టీడీపీ సభ్యులను ఒక్క రోజు సస్పెండ్ చేశారు.
3.జగన్ కు నాంపల్లి కోర్టు నోటీసులు
ఏపీ సీఎం జగన్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
4.క్రిమినల్ చట్టాల్లో మార్పులు
క్రిమినల్ చట్టాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.ఇండియన్ పీనల్ కోడ్ , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో సవరణలు తీసుకు వచ్చేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.
5.టెట్ పరీక్షలు రాసిన వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
టెట్ పరీక్షలు రాసిన వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.తెలంగాణలో టెట్ పరీక్షలను వీలైనంత తొందరగా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియా ఆదేశాలు జారీ చేశారు.
6.టీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది అని విమర్శించారు.
7.బండి సంజయ్ కామెంట్స్
టీఆర్ఎస్ ప్రభుత్వం పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ చేసారు.టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోంది అని సంజయ్ విమర్శించారు.
8.వడ్లు కొనే వరకు ఉద్యమమిస్తాం : ఎర్రబెల్లి
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనే వరకు ఉద్యమిస్తామని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
9.ఏపీ ప్రభుత్వం పై అచ్చెన్న కామెంట్స్
వైసీపీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇవ్వలేదా అని ఏపీ టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు సూటిగా ప్రశ్నించారు.
10.అనంతలో పరిటాల సునీత శ్రీరామ్ ల పై కేసు నమోదు
మాజీ మంత్రి పరిటాల సునీత ఆయన తనయుడు శ్రీరామ్ మరో 39 మంది టిడిపి నేతలపై పోలీస్ కేసు నమోదు అయ్యింది.30 పోలీస్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించడం తో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ర్యాలీ నిర్వహించడం పై రాప్తాడు ఏ ఎస్ ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.
11.జూలై 4 నుంచి ఏపీఈఏపీ సెట్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ , ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2022 సెట్ షెడ్యూల్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
12.జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి
తిరుపతి నగరం లో జనసేన కార్యకర్తల పై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు.నిన్న రాత్రి జనసేన కార్యకర్త రాజేష్ నాయక్, శేఖర్ రెడ్డి పై ఇమ్రాన్ , ఇర్భాన్ లు దాడి చేశారు.ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడిన ఆడియో వైరల్ గా మారింది.
13.నరసాపురం జిల్లా చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ను జిల్లా కేంద్రం చేయాలంటూ ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
14.ఆర్బిఐ లో పోస్టుల భర్తీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 303 పోస్టులను భర్తీ చేయనున్నారు.
15.చార్జీలు పెంచడం సరికాదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు పై బి ఎస్ పి రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.చార్జీల పెంపు సీఎం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమని ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
16.ఎంపీ ధర్మపురి అరవింద్ పై నాన్ బెయిలబుల్ వారెంట్
అరవింద్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ నాంపల్లి కోర్టు జారీ చేసింది.గతంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు , హార్డింగ్ లను చించివేయడం పై విచారణ చేపట్టిన కోర్టు ఎంపీ అరవింద్ విచారణకు హాజరు కాకపోవడం పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
17.నేడు ప్రధానిని కలవనున్న పంజాబ్ సీఎం
నేడు ప్రధానమంత్రి నరేంద్రమోది ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.
18.శ్రీశైలంలో నేటినుంచి స్పర్శ దర్శనం
శ్రీశైలంలో నేటినుంచి సర్ప దర్శనం జరుగనుంది.ఈ నెల 30 వరకు జరుగుతుంది.
19.హెల్మెట్ అవగాహన ర్యాలీ
శ్రీకాకుళం లో నేడు హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ట్రిపులార్ మూవీ రిలీజ్ సందర్భంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,950 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,310