మామూలుగా కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు రాబోతున్నాయి అంటే సినిమా మొదలు కాకముందే ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి.అటువంటి సినిమాలలో శ్రీకాంత్ ఓదెలా( Srikanth Odela ) అలాగే మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కాంబినేషన్లో రాబోతున్న సినిమా కూడా ఒకటి.
ఈ కాంబూలో రాబోతున్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.
డైరెక్టర్ శ్రీకాంత్ దీన్ని కూడా పవన్ కళ్యాణ్ ఓజి తరహాలో విపరీతమైన హైప్ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
న్యాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) సమర్పకుడిగా మారి నిర్మాణ వ్యవహారాల్లో భాగస్వామి కానుండటం బజ్ మరింత పెరిగేందుకు దోహదపడుతోంది.అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్టుని శ్రీకాంత్ ఓదెల నానితో ది ప్యారడైజ్( The Paradise ) పూర్తి చేశాక షురూ చేయబోతున్నారు.అయితే ఈ మూవీ రావడానికి ఇంకో ఏడాది పట్టవచ్చని తెలుస్తోంది.
అయితే ఇందుకు సంబంధించిన విషయంపై తాజాగా మరొకసారి శ్రీకాంత్ స్పందించారు.ఈ మేరకు శ్రీకాంత్ మాట్లాడుతూ.
నేను చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాను.
ఆయనతో కలిసి పని చేయబోవడం నమ్మశక్యంగా లేదు.48 గంటల్లో స్క్రిప్ట్ ఫైనల్ చేశాము.నాకైతే మబ్బుల్లో తేలుతున్నట్టు ఉంది.
మా సినిమా గతంలో వచ్చినట్టుగా ఉండదు.మీరు వింటేజ్ మెగాస్టార్ ని చూడరు.
ఒక ఫ్రెష్, వయసుకు తగ్గ అవతారంలో చూడబోతున్నారు.ఆయన క్యారవాన్ నుంచి బయటికి వచ్చే వరకు మాత్రమే నేను చిరు ఫ్యాన్.
ఒక్కసారి వచ్చాక చిరంజీవి గారు నా సినిమాలో ఒక క్యారెక్టర్ గా మారిపోతారు అని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అంతేకాకుండా శ్రీకాంత్ చిరు కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై కూడా అంచనాలను పెంచేశాయి.