నేచురల్ స్టార్ నాని ( Nani ) ప్రస్తుతం హిట్ 3 ( Hit 3 ) సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ కనుక చూస్తే సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని స్పష్టం అవుతుంది.ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో కొంతమంది జర్నలిస్టులపై( Journalists ) హీరో నాని తీవ్రస్థాయిలో అబ్రహం వ్యక్తం చేశారు.

ఈ సినిమాకు డైరెక్టర్ శైలేష్ కొలను( Sailesh Kolanu ) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో నాని హీరోగా నటించారు అయితే రాబోయే నాలుగవ భాగంలో హీరో ఎవరు అనే విషయాన్ని కూడా ఈ సినిమా క్లైమాక్స్ లో ప్రకటించబోతున్నారని కొంతమంది జర్నలిస్టులు ఈ సినిమా గురించి చేసే వ్యాఖ్యలపై డైరెక్టర్ శైలేష్ సీరియస్ అయ్యారు.తాజాగా ఈ విషయం గురించి నాని కూడా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినిమా గురించి అంచనాలు పెంచడానికి ఏది లీక్ చేయాలి, లీక్ చేయకూడదు కూడా తెలిసి ఉండాలి.మేము టెర్రరిస్టులము కాదు కదా.మా మీద స్పై పెట్టి లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకోడానికి.ఎందుకు అలా చేస్తున్నారు.మీ సోర్సెస్ మీకు ఉండొచ్చు.కానీ అది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు సినిమాల గురించి ముందుగానే తెలుసుకొని లీక్ చేసి ప్రేక్షకుడి అనుభవాన్ని పోగొడుతున్నారు.మేము థియేటర్లో గొప్పగా చూపించాలి అనుకుంటాం.
దాన్ని ముందే రివీల్ చేసేస్తారు.పోస్టర్స్, టీజర్లు, ట్రయలర్స్ ముందే అలా ఉంటుంది, అందులో ఈ డైలాగ్ ఉందనీ ముందుగానే చెబుతూ సినిమాకు డ్యామేజ్ చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తారు.