నెలసరి అంటేనే నొప్పుల మయం.కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ల నొప్పి, తలనొప్పి వంటివి తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి.
వీటికి తోడు చికాకు, ఒత్తిడి, ఆందోళన, మూడ్ స్వింగ్స్, పీరియడ్ క్రాంప్స్ తదితర సమస్యలు మరింత సతమతం చేస్తుంటాయి.అందుకే నెలసరి సమయం వస్తోందంటే మహిళలు తెగ హైరానా పడిపోతుంటారు.
ఈ క్రమంలోనే ప్రతి నెలా ఎదురయ్యే నెలసరి నొప్పుల నుంచి విముక్తి పొందడానికి కొందరు మాత్రలు వేసుకుంటూ ఉంటారు.
అయితే ప్రతిసారి మాత్రలు వేసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందుకే సహజ పద్ధతుల్లో నెలసరి నొప్పులను వదిలించుకునేందుకు ప్రయత్నించాలి.అందుకు నల్ల ఎండు ద్రాక్ష మరియు కుంకుమ పువ్వు అద్భుతంగా సహాయపడతాయి.మరి ఈ రెండిటినీ ఎలా తీసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా రెండు గిన్నెలను తీసుకుని.ఒకదాంట్లో ఆరు నుంచి ఎనిమిది నల్ల ఎండు ద్రాక్షలు, మరోదాంట్లో రెండు కుంకుమపువ్వు రెబ్బలు వేసుకోవాలి.ఆ తర్వాత రెండు గిన్నెల్లో వాటర్ పోసి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.ఉదయాన్నే బ్రష్ చేసుకుని గ్లాస్ గోరు వెచ్చని నీటిని సేవించాలి.
ఓ పది నిమిషాల అనంతరం నానబెట్టుకున్న నల్ల ఎండు ద్రాక్షలు, కుంకుపువ్వు రెబ్బలను నీటితో సహా తీసుకోవాలి.
ఇలా నెలసరి సమయంలో చేస్తే.ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వులో ఉండే ప్రత్యేకమైన పోషకాలు కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ల నొప్పి, తలనొప్పి మరియు ఇతర శారీరక నొప్పులను దూరం చేస్తాయి.అలాగే మూడ్ స్వింగ్స్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యల నుంచి సైతం విముక్తిని కలిగిస్తాయి.
కాబట్టి, ఇకపై నెలసరి సమయంలో నొప్పులను నివారించుకోవడం కోసం పెయిన్ కిల్లర్స్ పై ఆధారపడటం మానేసి.నల్ల ఎండు ద్రాక్ష, కుంకుమపువ్వులను పైన చెప్పిన విధంగా తీసుకునేందుకు ప్రయత్నించండి.