ఒక్కో సారి చాల సరదాగా కొన్ని మాటలు అంటూ ఉంటారు.అవి నిజమో, కాదో సంగతి పక్కన పెడితే వాటి వెనక ఒక గూడార్ధం ఉంటుంది.
ఎవరు ఊరికే ఒక మాట అనేయరు కదా.అలాగే ఒక్క హీరో లేదంటే హీరోయిన్, లేదా దర్శకుడు ఎంత గొప్పగా చేసిన అన్ని సినిమాలు గొప్పవి అయిపోవు కదా.ఆలా అయిపోయిన వాటి వెనక కొన్ని విషయాలు అయినా పంటి కింద రాయిలా తగులుతూనే ఉంటాయి.1976 లలో వచ్చిన ఒక సినిమా కూడా అలంటి ఒక పేరునే సంపాదించుకుంది;.ఆ సినిమా పేరు భక్త కన్నప్ప అయితే ఈ సినిమాలో కృష్ణం రాజు , వాణిశ్రీ హీరో హీరోయిన్స్ గా నటించారు.సినిమా అయితే సూపర్ హిట్ అయ్యింది.
ఇది కన్నడ రాజ్ కుమార్ నటించిన బెదర కన్నప్ప సినిమాకు రీమేక్.రాజ్ కుమార్ ఈ సినిమాను కన్నప్ప నయనార్ అనే మహా భక్తుడి జీవిత విశేష ఆధారం గా తెరకెక్కించారు.
ఈ సినిమాను పూర్తిగా తెలుగు వారి మనసు గెలుచుకునేలా చేయడం లో దర్శకుడు బాపు బాగా సక్సెస్ అయ్యారు.అయితే ఈ సినిమాకు కృష్ణమ రాజు టైటిల్ పాత్రలో నటించి చాల బాగా న్యాయం చేసాడు.
అయితే హీరోయిన్ గా నటించిన శ్రీవాణి పాత్రా కూడా సినిమాకు మంచి బలం.అయితే శ్రీవాణి కి అప్పటికే వయసు బాగా పెరిగిపోయింది అనే మాట బాగ్ వినిపిస్తుంది.అయినా కూడా హీరోయిన్ పాత్రల్లోనే నటిస్తుంది.ఆ తర్వాత మరో రెండేళ్లు దాదాపు 15 సినిమాల్లో నటించింది.

భక్త కన్నప్ప సినిమాలో హీరోయిన్ గా వాణిశ్రీని చూసి చాల మంది పెదవి విరిచారు.ఆమెకు అప్పటికే వయసు ఎక్కువగా కనిపిస్తుండటం పైగా సినిమా బడ్జెట్ కన్నా కూడా మేకప్ ఖర్చు బాగా ఎక్కువ అయ్యింది అంటూ సెటైర్స్ వేయడం వంటివి జరిగాయి.దాంతో ఆమె ఆ తర్వాత రేడేళ్ళకే 1978 లో ఆమె ఫ్యామిలీ డాక్టర్ అయినా కరుణాకరన్ ని పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ ఒక 9 ఏళ్ళ పాటు దూరం అయ్యింది.ఆ తర్వాత అత్త పాత్రల్లో, తల్లి పాత్రల్లో బాగానే నటించింది.
అయితే వాణిశ్రీ మేకప్ పై సరదాగా కామెంట్స్ వచ్చిన ఆ సినిమా మాత్రం బాగానే విజయం సాధించింది.







