మన భారతదేశంలో చాలా సంవత్సరాల నుంచి హిందూ ముస్లింలు భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు.మన దేశంలో మసీదులకు ముస్లింలతో పాటు హిందువులు వెళ్తూ ఉంటారు.
అలాగే దర్గాలకు కూడా వెళ్తుంటారు.అక్కడ వారి మొక్కలను తీర్చుకుంటూ ఉంటారు.
అదేవిధంగా ముస్లింలు కూడా హిందువుల పండుగలను, ఆచారాలను ఎంతో గౌరవిస్తూ ఉంటారు.శుభకార్యాలలో పరస్పరం ఒకరి ఇంటికీ మరొకరు వెళ్లి చేసుకుంటూ ఉంటారు.
అయితే ఇక్కడ హిందువులు మసీదు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారు.బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో బెన్ బ్లాక్ లో ఒక గ్రామం ఉంది.
ఈ గ్రామంలో ప్రతిరోజూ ఐదు సార్లు అజాన్ వినిపిస్తూ ఉంది.కానీ గ్రామంలోని ప్రజలలో ఎవరు నమాజ్ చేయడానికి ఇక్కడికి రారు.
ఈ గ్రామంలో ఒక ముస్లిం కుటుంబం కూడా లేదు.కానీ మసీదులో ఐదు సార్లు వినిపిస్తుంది.నిజానికి ఇదంతా మతసామరస్రానికి ఉదాహరణగా నిలిచే కథ.హిందూ సమాజానికి చెందిన ప్రజలు మసీదును నిర్వహిస్తున్నారు.ఎప్పటికప్పుడు అజాన్ రోజుకు ఐదుసార్లు వినిపిస్తారు.దీని బాధ్యత గ్రామంలోని హిందువుల చేతుల్లోనే ఉంది.మతసామరస్య వార్తలకు దూరంగా ఈ గ్రామంలో ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉంటే హిందూ మతానికి చెందిన వారు మసీద్ను శుభ్రం చేయడంలో పగలు మరియు రాత్రి మంచి పనులు చేస్తూ ఉంటారు.ఈ మసీదు వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఏదైనా సంతోషకరమైన కార్యక్రమం జరిగినప్పుడు ఈ గ్రామస్తులు మసీదుకు వెళ్తారు.వివాహమైన, ఏదైనా శుభకార్యామైన ముందుగా మసీద్ను సందర్శించుకోవాలి అన్నది ఆ గ్రామ ప్రజల గట్టి నమ్మకం.ఈ గ్రామంలో అగ్ని ప్రమాదాలు, వరదలు ఎప్పుడు వస్తూ ఉండేవి.హజరత్ ఇస్మాయిల్(అ.స) సుమారు 600 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి వచ్చారు.అప్పటినుంచి ఆ గ్రామంలో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు.
ఆ తర్వాత గ్రామస్తులు ఆయనను మసీదు దగ్గర ఖననం చేశారు.ఈ మసీదు నిర్మాణం సుమారు 200 సంవత్సరాల క్రితం జరిగింది.
నిజానికి ఇక్కడి హిందువులకు అజాన్ చదవడం తెలియదు కాబట్టి పెన్ డ్రైవ్ లో తీసుకుంటున్నారు అంటే అజన్ రికార్డ్ ద్వారా అప్లై చేయబడుతుంది.
DEVOTIONAL