ఆచార్య చాణక్యుడు( Chanakya ) తన అర్థశాస్త్రం అనే పుస్తకంలో ఎన్నో విషయాల పై తన అభిప్రాయాలను రాశాడు.అందులో వివాహం కుటుంబం అనే అంశాల పై కూడా చాలా విషయాల గురించి రాశాడు.
మంచి లక్షణాలతో కూడిన భార్య ఇంటికి ఎంతో ముఖ్యమైనది అని, ఆమె సంతోషకరమైన సంపన్నమైన కుటుంబాన్ని ఎలా సృష్టించగలదో అన్న విషయాన్ని వివరించాడు.మీరు పెళ్లి చేసుకోబోతున్నారంటే చాణక్యుడి ఈ విషయాలు తెలుసుకోవాలి.
మంచి భార్య యొక్క లక్ష్యం లక్షణం ఏంటి? ఆమె ఇంటికి రావడం వలన కుటుంబంలో ఎలాంటి సంతోషాలు వస్తాయో, మీ అదృష్టం ఎలా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే వివాహం( Marriage ) జీవితంలో ఒక్కసారి జరుగుతుంది.కాబట్టి వివాహానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగా పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.కాబట్టి అదృష్టవంతురలైన భార్యను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
భార్య అందం, సరళతలో పరిపూర్ణంగా ఉండాలని చెప్పాడు.ఆమె తన భర్తతో స్వయం త్యాగంతో,తన సాధారణ సహజమైన లక్షణాలతో జీవించాలని చాణుక్యుడి శాస్త్రం చెబుతోంది.
అలాగే భార్య తెలివిగా సున్నిత మనస్కురాలుగా ఉండాలని చెబుతున్నారు.అన్ని రకాల త్యాగాల కైనా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి.

అలాగే మంచి నైతిక స్వభావం, సామర్థ్యం ఉన్న భార్యా తన కుటుంబానికి ఉత్తమంగా సేవ చేయడానికి, తన రంగంలో మంచి నైపుణ్యం కలిగి ఉండాలని చెబుతున్నారు.మంచి భార్య తన భర్త కుటుంబానికి నమ్మకంగా, అంకితభావంతో ఉండాలి.కొనసాగిస్తూ మంచి జీవితాన్ని గడపగలుగుతుంది.అప్పుడే భర్తతో సుఖసంతోషాలు కొనసాగిస్తూ,సరైన నిర్ణయం తీసుకునేలా మంచి నిర్ణయాన్ని తీసుకోగలదు.అలాగే భార్యకు తమ కుటుంబం పై ఖచ్చితమైన అవగాహన ఉండాలి.అలాగే సామాజిక, కుటుంబ సంబంధాలను మెరుగుపరచడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తు ఉండాలి.