ప్రస్తుతం మన దేశంలో ఉన్న చాలా మంది ప్రజలు అయోధ్య( Ayodhya ) గురించే మాట్లాడుకుంటున్నారు.ఎందుకంటే అందరి చూపు అయోధ్య వైపే ఉంది.
జనవరి 22వ తేదీన రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది.ఈ వేడుకను ప్రధాని మోదీ( PM Modi ) నిర్వహించనున్నారు.
అంతే కాకుండా ఈ వేడుకలలో దేశ విదేశాల ప్రముఖులు పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది.అలాగే మరుసటి రోజు అంటే జనవరి 23వ తేదీ నుంచి భక్తులు అయోధ్య రామున్ని దర్శించుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి 11,000 మంది అతిధులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది.

వివిధ రంగలకు చెందిన ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.ముఖ్యంగా చెప్పాలంటే శ్రీరాముడు పుట్టిన తేదీ నీ ఓ సంస్థ తెలిపింది.అలాగే పురాణాలన్ని రాముడు త్రేతా యుగంలోనే జన్మించాడని చెబుతూ ఉన్నాయి.
వాల్మీకి రామాయణం( Ramayanam ) కూడా.రామాయణమంతా త్రేతాయుగంలోనే జరిగిందేనని స్పష్టం చేసింది అయినప్పటికీ మన అందరికీ అర్థమయ్యేలా స్పష్టమైన తేదీ చెప్పలేదు.
వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్లే సమయానికి ఆయన వయస్సు 25 సంవత్సరాలుగా వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే శ్రీరాముడు పుట్టిన తేదీ( Lord Sri Ram Date of Birth ) క్రీస్తు పూర్వం 5114వ సంవత్సరం, జనవరి 10వ తేదీన, మధ్యాహ్నం 12.05 నిమిషములకు అని ఇనిస్ట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ గుణాంకాలతో నిర్ధారించింది.

అలాగే మహాభారతం, రామాయణాలు, పౌరాణిక ఇతిహాసాలు కేవలం కల్పిత కావ్యాలు కావని ఇవి చరిత్రక గ్రంథాలని సంస్థ వెల్లడించింది.అంతే కాకుండా లంకలోని అశోక వనంలో రాముడు సీతా తల్లిని కలిసిన సంవత్సరం 5076 సెప్టెంబర్ 12వ తేదీ అని సంస్థ వెల్లడించింది.ఇంకా చెప్పాలంటే మహా భారత యుద్ధం క్రీస్తు పూర్వం 3139 అక్టోబర్ 13వ తేదీన ప్రారంభమైందని సంస్థ వెల్లడించింది.