ఒక విధంగా చెప్పాలంటే రైలు ప్రయాణికులకు ఇది శుభవార్త అనే చెప్పాలి.ఎందుకంటే ప్రస్తుతం 30% అధిక ధరతో నడుస్తోన్న స్పెషల్ రైళ్లను మరికొద్ది రోజుల్లో రద్దు చేసి తిరిగి రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
అలాగే కరోనా కష్ట కాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్న విషయం అందరికి తెలిసిందే.కరోనాను కట్టడి చేసే క్రమంలో లాక్‌డౌన్ కూడా విధించారు.
ఆ క్రమంలోనే రైల్వే శాఖ రైలు టికెట్ ధరలను కూడా పెంచింది.మళ్ళీ ఆ ధరలను కూడా తగ్గించనున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించే పనిలో ఉన్నారు రైల్వే అధికారులు.కరోనా వైరస్ రాకముందు ప్రతిరోజు దాదాపు 1700 మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, 3,500ల ప్యాసింజర్ రైళ్లు క్రమం తప్పకుండా నడిచేవని లాక్ డౌన్ కారణంగా విధించిన ఆంక్షలతో కొన్ని రైల్వే సేవలు నిలిచిపోయాయి.
ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య తగ్గాయి.అలాగే ప్రజల ప్రయాణ సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రైల్వేశాఖ మళ్ళీ ప్రత్యేక రైళ్లను నడిపించడం ప్రారంభించిందని తెలిపారు.

వచ్చే రెండు నెలల్లో టికెట్ ధర తగ్గడంతో పాటు రైల్వే సేవలు మొత్తం యధావిధిగా అమలు అవుతాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు.కాగా కరోనా రాకముందు ఎలాగయితే రైళ్ల పేర్లు, నంబర్లు, ఛార్జీలు ఉన్నాయో అలాగే మళ్ళీ యధావిధిగా అమలు అవుతాయని పేర్కొంటూ రైల్వే బోర్డు అన్ని జోనల్ కార్యలయాలకు లేఖలు రాసింది.అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ప్రత్యేక రైలు నెంబర్ కు మొదట సున్నా ఉండేదని కానీ ఇకమీదట ఆ సున్నా ఉండబోదని రైల్వే అధికారులు తెలిపారు.