పొరపాటున కూడా మాంసాహారాన్ని ఈ రోజుల్లో తినకూడదు.. ఎందుకంటే?

సాధారణంగా హిందువులు వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాంసం తినడానికి ఇష్టపడరు.అందుకు గల కారణం వారు వారి ఇష్టదైవానికి ఎంతో ప్రీతికరమైన రోజున మాంసాహారం తినరు.

 Non Vegetarian, Amavasya, Pooja After Eating Non Veg, Hindus,latest News-TeluguStop.com

వారంలో ముఖ్యంగా సోమవారం, గురువారం, శుక్ర ,శని వారాలలో ఎక్కువగా మాంసాహారాన్ని తినడానికి ఇష్టపడరు.అదేవిధంగా మరికొందరు ప్రతి నెలలో ఏకాదశి రోజున అమావాస్య రోజున కూడా మాంసాహారం తినరు.

మరి కొంత మంది హిందువులు సంవత్సరంలో ఎంతో ముఖ్యమైన శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం వంటి నెలలో నెల మొత్తం దేవతలకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ మాంసాహారం ముట్టరు.ఈ విధంగా తినకపోవడానికి గల కారణం మన హిందువులు సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు.

ఈ క్రమంలోని కొందరు శివ భక్తులు సోమవారం మాంసం ముట్టరు.అదే విధంగా సాయిబాబా భక్తులు గురువారం, అమ్మవారి భక్తులు శుక్రవారం, వెంకటేశ్వర స్వామి భక్తులు శనివారం మాంసాన్ని ముట్టుకోరు.

పొరపాటున కూడా ఈ రోజులలో మాంసాహారం తింటే వారికి కీడు జరుగుతుందని, అనారోగ్యానికి గురవుతారని భావిస్తారు.

వారంలో ఈ రోజులలో మాంసాహారం ముట్టకూడదు అనే సంప్రదాయం పూర్వీకుల నుంచి వస్తోంది.

ఈ విధంగా వారంలో కొన్ని రోజులు మాంసాహారం తినకపోవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది.వారంలో ప్రతి రోజు మాంసాహారాన్ని తినడం అలవాటు చేసుకుంటే ఈ భూమిపై జీవరాసుల మనుగడ తగ్గిపోతుంది.

ఎన్నో వందల సంఖ్యలో జంతువులు, పక్షులు తగ్గిపోతాయి.కనుక మన పూర్వీకులు వారంలో కొన్ని రోజులు మాంసాహారం ముట్టకూడదనే ఆచారాన్ని పెట్టారు.

అందుకోసమే భక్తులు తమకు ఇష్టమైన రోజున మాంసాహారం తినరు.ఒకవేళ తిన్న వారికి ఏదో చెడు జరుగుతుందనే ఆందోళనలో ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube