పంచాంగం ప్రకారం జగన్నాథ రథయాత్ర( Jagannath Rath Yatra ) ఆషాడ మాసం శుక్లపక్షం బీజ రోజున నిర్వహిస్తారు.ఈ ఏడాది జగన్నాథ యాత్ర 2023 జూన్ 20 పవిత్రమైన రోజున మొదలుపెట్టనున్నారు.
దేశంలోని వివిధ నగరాల్లో జగన్నాథ యాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వారు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.శ్రీకృష్ణ భగవానుడు అంటే జగన్నాథుడు.
తన అన్న బలభద్రుడు మరియు సోదరి సుభద్రతో కలిసి ఆషాడ మాసం( Ashadamasam ) శుక్లపక్షం రోజు 9 రోజుల తీర్థయాత్రకు వెళ్లాడని చెబుతున్నారు.

ఇప్పుడు జగన్నాథ రథయాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.జగన్నాథ యాత్రలో జగన్నాథుడు, అన్న బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహానికి ( Subhadra idol )చేతులు కాళ్లు గోళ్లు ఉండవు.ఇది తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు.
కానీ అలా చేయడానికి కారణాలు పురాణాలలో ఉన్నాయి.ప్రాచీన కాలంలో విశ్వకర్మ ఈ విగ్రహాన్ని తయారు చేసేవాడని చెబుతారు.
అయితే విగ్రహం తయారు చేసే ముందు ఆయన ఒక షరతు పెట్టారు.విగ్రహాన్ని తయారు చేసే వరకు ఎవరు వారి గదిలోకి ప్రవేశించలేరు.

అయితే రాజు గది తలుపు తెరిచినప్పుడు విశ్వకర్మ విగ్రహాన్ని( Vishwakarma statue ) తయారు చేయడం మధ్యలో ఆపేశాడు.అప్పటినుంచి విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోగా, ఇప్పటివరకు విగ్రహాలు అసంపూర్తిగానే ఉన్నాయి.ఇంకా విశేషమేమిటంటే ఈ విగ్రహాలను వేప చెక్కతో తయారు చేశారు.ఇంకా చెప్పాలంటే దేశం వ్యాప్తంగా అనేక నగరంలో జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది.అయితే పూరి జగన్నాథుని రథయాత్ర కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.దేవుడు రథయాత్ర ద్వారా ఏడాదికి ఒకసారి ప్రజల మధ్యకు వెళ్తాడు.
జగన్నాథపురిలో జగన్నాథుని రథయాత్ర ఆషాడం దశమి రోజు ముగుస్తుంది.తాళ ధ్వజా రథంపై రథయాత్రలో మొదటివాడు బలరాముడు.
ఆ తర్వాత పద్మ ధ్వజ రథం పై మాత సుభద్ర మరియు సుదర్శనం మరియు చివరి నంది ఘోష రథంలోని గరుడ పతాకంపై జగన్నాథుడు ఉన్నారు.