ఐఆర్‌సీటీసీ సూపర్‌ యాప్‌‭తో ఆ సమ్యలన్నిటికి చెక్..

ప్రతిరోజు కూడా భారతీయ రైల్వే( Indian Railways ) వ్యవస్థ కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యానికి చేరవేస్తుంది.సాధారణంగా దురా ప్రాంతాలకు వెళ్లే సమయంలో రైల్లో ప్రయాణం చేయాలి అంటే.

 Indian Railways To Launch All-in-one Super App Will Be Integrated With The Irctc-TeluguStop.com

కచ్చితంగా టికెట్ బుక్ చేసుకోవాల్సిందే.లేకపోతే రైలు ప్రయాణం చాలా కష్టతరంగా మారుతుంది.

అదే మనం ట్రైన్ బుకింగ్( Train Booking ) చేసుకొని ప్రయాణం చేస్తే ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా మన గమ్యానికి మనం చాలా సులువుగా చేరుకోవచ్చు.అయితే ట్రైన్ టికెట్స్ బుకింగ్ కోసం ప్రస్తుతం అందరూ కూడా ఐఆర్‌సీటీసీ యాప్( IRCTC APP ) ఉపయోగిస్తున్నారు.

Telugu Railway App, Indian Railways, Indian Trains, Irctc, Irctc App, Larest, Pn

ఇక పిఎన్ఆర్ స్టేటస్, ట్రైన్ లైవ్ స్టేటస్ చూసేందుకు వివిధ రకాల యాప్స్ ను ఉపయోగిస్తూ ఉన్నారు రైల్వే ప్రయాణికులు.ఇక ఇలా వివిధ రకాలు యాప్స్ ను ఉపయోగించడం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.ఇకపై ఆ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఐఆర్‌సీటీసీ వారు ఒక కొత్త సూపర్ యాప్ ను( IRCTC Super APP ) ప్రవేశ పెట్టబోతున్నారు.ఈ యాప్ ద్వారా అన్ని రకాల సేవలను ప్రయాణికులు చాలా సులువుగా పొందవచ్చు.

రైల్వే శాఖకు సంబంధించిన టికెట్స్ బుకింగ్, పిఎన్ఆర్ స్టేటస్, ట్రైన్ ట్రాకింగ్ స్టేటస్ కోసం వివిధ రకాల యాప్ లను ఉపయోగించడానికి వినియోగదారులకు చాలా కష్టతరంగా మారింది.ఈ సమస్యను అధిగమించేందుకే ఇండియన్ రైల్వేస్ వారు సరికొత్త సూపర్ యాప్ ను ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది.

Telugu Railway App, Indian Railways, Indian Trains, Irctc, Irctc App, Larest, Pn

ఇకపై ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్ ద్వారా టికెట్స్ బుకింగ్, పిఎన్ఆర్ స్టేటస్, ట్రైన్ ట్రాకింగ్ చేసేందుకు చాలా సులువుగా ఉంటుంది.అంతేకాకుండా మనం ట్రైన్ లో ప్రయాణం చేసే క్రమంలో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు కూడా ఈ యాప్ ను ఉపయోగించుకోవచ్చు.ప్లాట్ ఫామ్ టికెట్ నుంచి జనరల్ టికెట్ వరకు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో మనం ఈ యాప్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలియచేస్తున్నారు.డిసెంబర్ నెల చివరి నాటికి ఈ సూపర్ యాప్ అందరికీ అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.

ఇలా పలు సేవల కోసం ప్రస్తుతం అందరూ ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మరి వినియోగిస్తూ ఉన్నారు.అంతేకాకుండా రైలు సేవల కోసం ప్రజలు రైల్ మదద్, యూటీఎస్, సటార్క్, టీఎమ్‌సీ నిరీక్షన్, ఐఆర్‌సీటీసీ ఎయిర్, పోర్ట్‌రీడ్‌ వంటి యాప్‌లను ఉపయోగిస్తూ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube