చైతన్య శోభిత పెళ్లి వేదిక ఫిక్స్ అయిందా.. అక్కడే పెళ్లి జరగబోతుందా?

అక్కినేని నాగచైతన్య,( Akkineni Nagachaitanya ) శోభితా ధూళిపాళ్ల( Sobhita Dhulipala ) ఇటీవల ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటి అయిన విషయం తెలిసిందే.త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు.

 Naga Chaitanya Sobhita Wedding To Happen In Annapurna Studios Details, Naga Chai-TeluguStop.com

ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.ఇటీవల శోభిత ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం మొదలుపెట్టగా అందుకు సంబంధించిన ఫోటోలను శోభిత సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు అక్కినేని ఫ్యామిలీలో కూడా ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి.డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితల పెళ్లి జరగనుందని తెలుస్తోంది.

Telugu Akkineni, Hyderabad, Naga Chaitanya, Nagachaitanya, Sobhita, Thandel, Tol

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ముందుగా గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని అనుకున్నారట.రాజస్థాన్‌ లోని ఒక మంచి ప్యాలెస్‌ లో నాగ చైతన్య- శోభితల పెళ్లి చేద్దామని అనుకుంటున్నారట.అయితే ఇప్పుడీ ఆలోచనను విరమించుకున్నారట.హైదరాబాద్‌ లోనే తన కుమారుడి పెళ్లి చేయాలని నాగార్జున ఫిక్స్‌ అయ్యారట.ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోను( Annapurna Studios ) ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

గ్రాండ్ వెడ్డింగ్ కోసం వేదికను సిద్ధం చేసే బాధ్యతలను ఒక ప్రముఖ ఆర్డ్ డైరెక్టర్ కు అప్పగించినట్లు సమాచారం.

Telugu Akkineni, Hyderabad, Naga Chaitanya, Nagachaitanya, Sobhita, Thandel, Tol

నాగ చైతన్య-శోభితల వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ జంట ఎప్పుడెప్పుడు మూడుముళ్ల బంధంతో ఒకటి అవుతారా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube