తెల్ల వెంట్రుకలు రావడం ప్రారంభం అయ్యాయా? వర్రీ వద్దు వెంటనే ఇలా చేయండి!

ఇటీవల రోజుల్లో ఎక్కువ శాతం మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల జుట్టులో మెలనిన్ ఉత్పత్తి( Melanin ) తగ్గిపోతుంది.

 Effective Remedy For Stopping White Hair!, White Hair, Home Remedy, Hair Care, H-TeluguStop.com

దీని వల్ల జుట్టు తెల్లబడటం ప్రారంభం అవుతుంది.దీంతో వైట్ హెయిర్ ని కవర్ చేసుకునేందుకు కలర్స్ పై ఆధారపడుతుంటారు.

మీకు కూడా తెల్ల వెంట్రుకలు రావడం ప్రారంభం అయ్యాయా? అస్సలు వర్రీ వద్దు.వెంటనే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని పాటించండి.

Telugu Coffee Powder, Care, Care Tips, Remedy, Peel, White-Telugu Health

ఈ రెమెడీ మెలనిన్ ఉత్పత్తి పెంచి జుట్టు తెల్లబడడాన్ని అడ్డుకుంటుంది.అదే సమయంలో తెల్లబడిన జుట్టు( white hair 0ను నల్లగా మారుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని రెండు కప్పుల ఉల్లి తొక్కలు( Onion Peel ) వేసి నల్లగా మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి.

ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లి తొక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Coffee Powder, Care, Care Tips, Remedy, Peel, White-Telugu Health

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న ఉల్లి తొక్కల పొడిని వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం, రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్ని కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే తెల్లగా మారిన వెంట్రుకలు కొద్ది రోజుల్లోనే నల్ల బ‌డతాయి.

అలాగే ఈ రెమెడీ జుట్టు తెల్లబడడాన్ని అడ్డుకుంటుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

జుట్టు రాలడం సైతం కంట్రోల్ అవుతుంది.కాబట్టి తెల్ల వెంట్రుకలు( White Hair ) రావడం ప్రారంభం అయ్యాయి అంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెమెడీని పాటించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube