ఆవాలతో తయారు చేసే ఆవనూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కొందరు ఆవనూనెను వంటలకు ఉపయోగిస్తుంటారు.
ఆవనూనెలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.ఈ పోషకాలు ఆరోగ్యాన్ని పెంచడంలోనూ.
అనారోగ్య సమస్యలను దూరం చేయడంలోనూ అద్భుతంగా సహాయపడతాయి.ఇక ఆవనూనెతో ఆరోగ్య పరంగానే కాకుండా.
సౌందర్య పరంగానూ బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గించడంలో ఆవ నూనె ఉపయోగపడుతుంది.
మరి ఆవనూనెను ఎలా చర్మానికి యూజ్ చేయాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఒక బౌల్‌లో కొద్దిగా ఆవనూనె, శెనగపిండి, కొద్దిగా నిమ్మరసం తీసుకుని.బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.
ఇరవై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.
ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి.

ముడతలను తగ్గించి ముఖాన్ని యవ్వనంగా, మృదువుగా మార్చడంలోనూ ఆవనూనె ఉపయోగపడుతుంది.అందుకు ఒక బౌల్‌లో ఆవనూనె మరియు కొబ్బరి నూనె సమానంగా తీసుకుని.బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి సర్కిలర్ మోషన్‌లో అప్లై చేస్తూ.ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
అర గంట తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే గనుక.
ముడతలు క్రమంగా పోయి ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
ఇక ఈ చలి కాలంలో పెదవులు డ్రైగా మారిపోతూ ఉంటాయి.
అయితే ఈ సమస్యను నివారించడంలో ఆవనూనె సూపర్‌గా సహాయపడుతుంది.ప్రతి రోజు నిద్రించే ముందు ఆవనూనెను పెదవులకు అప్లై చేసి.
పడుకోవాలి.ఇలా చేయడం వల్ల.
ఆవనూనెలో ఉండే విటమిన్ ఈ మరియు విటమిన్ బి పొడిబారిన పెదాలను మృదువుగా మారుస్తాయి.