సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరోయిన్లు చాలా భిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు.హీరోల పక్కన రొమాంటిక్ పాత్రలలోనూ అలాగే వారికి ప్రేయసిగా నటించడానికి మాత్రమే ఇష్టపడతారు తప్ప భార్యల పాత్రలలో నటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరు.
ఇలా భార్య పాత్రలలో నటిస్తే కనుక వారి కెరియర్ ఇబ్బందులలో పడుతుందని ఇక వారికి అదే తరహా పాత్రలు వస్తాయని భావించి ఇలాంటి పాత్రలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు.ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki vastunnam ) సినిమాలో ఐశ్వర్య రాజేష్ నలుగురు పిల్లల తల్లి పాత్రలో నటించారు.

ఇకపోతే ఈమె కంటే ముందుగా ముగ్గురు హీరోయిన్లు నలుగురు పిల్లలకు తల్లి అంటే తాము చేయమని రిజెక్ట్ చేసినట్లు స్వయంగా ఐశ్వర్య వెల్లడించారు.ఇలా పిల్లల తల్లి పాత్రలలో భార్య పాత్రలలో నటించడానికి హీరోయిన్స్ ఆసక్తి చూపరు.కానీ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ అయినా రష్మిక మందన్న( Rashmika Mandanna ) మాత్రం వరుసగా భార్య పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.

ఇటీవల ఈమె సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ ( Animal )సినిమాలో పిల్లల తల్లి పాత్రలో కనిపించారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ( Pushpa 2 )సినిమాలో కూడా అల్లు అర్జున్ కి భార్య పాత్రలో నటించారు.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇక తాజాగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా( Chhaava ) అనే సినిమాలో కూడా భార్య పాత్ర( Wife Role )లో నటించారు.
ఇక ఇందులో కూడా ఈమె పిల్లల తల్లి పాత్రలో కనిపించారు.ఇలా ఈ మూడు సినిమాలలో కూడా భర్తకు సపోర్ట్ చేసే భార్య పాత్రలలో నటించి మూడు సినిమాల ద్వారా హిట్ కొట్టడంతో రష్మిక భార్య పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని అభిమానులు భావిస్తున్నారు.
ఇకనైనా ఈమె ఇదే తరహాలో కాకుండా విభిన్న పాత్రలలో నటిస్తే బాగుంటుందని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.