ముఖం అందంగా గ్లోయింగ్ గా కనిపించాలని దాదాపు ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆరాటపడుతుంటారు.ముఖ్యంగా మగువలు ఈ విషయంలో అస్సలు రాజీపడరు.
అటువంటి చర్మాన్ని పొందడం కోసం బ్యూటీ పార్లర్‌లో వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.అయితే ఇక పై పార్లర్ గ్లో ఇంట్లోనే పొందవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా అంటే చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అర కప్పు పాలు( cup of milk ) పోసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Organic turmeric ) వేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఇలా మరిగించిన పసుపు పాలను చల్లారపెట్టుకుని అందులో వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), వన్ టీ స్పూన్ ముల్తానీ మట్టి( Multani soil ), వన్ టీ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు కనుక ఈ సింపుల్ రెమెడీని మిస్ అవ్వకుండా పాటించారంటే మీరు ఆశ్చర్యపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.ఈ రెమెడీ చర్మాన్ని లోతుగా క్లెన్సింగ్ చేస్తుంది.చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి మృత కణాలను తొలగిస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.అలాగే ఈ రెమెడీ మొటిమలకు అడ్డుకట్ట వేస్తుంది.
మొండి మచ్చలను క్రమంగా మాయం చేస్తుంది.ముల్తానీ మట్టి, కాఫీ పౌడర్, రోజ్ పెటల్స్ పౌడర్ స్కిన్ కలర్ ను పెంచుతాయి.
చర్మం తెల్లగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.కాబట్టి పార్లర్ గ్లో ను ఇంట్లోనే పొందాలనుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్పకున్నా హోమ్ రెమెడీని ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.