సాధారణంగా కొందరి జుట్టు అనేది చాలా పల్చగా ఉంటుంది.ఇందుకు హెయిర్ ఫాల్ ( Hair fall )ఒక కారణమైతే.
హెయిర్ గ్రోత్ లేకపోవడం మరొక కారణం.అయితే ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టి మీ జుట్టును డబుల్ చేసే న్యాచురల్ జెల్ ఒకటి ఉంది.
ఆ జెల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక చిన్న బీట్ రూట్ ( Beet root )ను తీసుకొని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు( fenugreek ) వేసి ఉడికించాలి.
దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే వాటర్ జెల్ గా మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని చల్లార పెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక క్లాత్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జెల్ ను నేరుగా స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.జెల్ అప్లై చేసుకున్న గంట, గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ న్యాచురల్ జెల్ ను కనుక వాడితే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.
హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.ఈ జల్ ను వాడడం వల్ల ఊడిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది.
పల్చటి కురులు ఒత్తుగా మారతాయి.

అలాగే ఈ జెల్ కురులకు మంచి తేమను అందిస్తుంది.డ్రై హెయిర్ సమస్యను దూరం చేస్తుంది.అదే సమయంలో జుట్టు చిట్లడం, విరగడం వంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గు ముఖం పడతాయి.
ఈ జెల్ తో మీ జుట్టు ఒత్తుగా షైనీ గా మారుతుంది.కాబట్టి తప్పకుండా ఈ జెల్ ను తయారు చేసుకొని వాడేందుకు ప్రయత్నించండి.