కార్తీకదీపం సీరియల్ ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా శోభాశెట్టి( Shobha Shetty ) మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.కార్తీకదీపం మోనిత పాత్ర శోభాశెట్టి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.
యశ్వంత్ రెడ్డి( Yaswanth Reddy ) అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు శోభాశెట్టి గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే.గతేడాది మే నెలలోనే వీళ్లిద్దరికి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
శోభ తాజాగా యశ్వంత్ రెడ్డితో కలిసి పూజ( Pooja ) చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.శోభాశెట్టి 16 కలశాలు పెట్టి మధ్యలో శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేశారు.
పూజ చేయడం వెనుక అసలు కారణాల గురించి శోభాశెట్టి చెప్పుకొచ్చారు.కొత్తింట్లోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోందని ఆమె తెలిపారు.
అప్పుడు పూజ చేసి ఇంటికి గుమ్మడికాయ కట్టామని ఆమె తెలిపారు.

దిష్టి తాకి ఆ గుమ్మడికాయ ఇప్పుడు పాడైపోయిందని శోభాశెట్టి వెల్లడించారు.అందుకే పంతులుగారిని పిలిచి పూజ చేశామని ఆమె తెలిపారు.దీని వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయని ఇలాంటివి యశ్వంత్ ఎక్కువగా నమ్మడని కానీ నేను, అత్తమ్మ ఎక్కువగా నమ్ముతామని శోభాశెట్టి వెల్లడించారు.
శోభాశెట్టి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

శోభాశెట్టి కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని మరిన్ని ప్రాజెక్ట్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.శోభాశెట్టిని అభిమానించే ఫ్యాన్స్ సైతం భారీ స్థాయిలో ఉన్నారు.సోషల్ మీడియాలో సైతం శోభాశెట్టి సంచలనాలు సృష్టిస్తున్నారు.
శోభాశెట్టి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.శోభాశెట్టి తెలుగు సీరియల్స్ తో బిజీ ఐతే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీరియల్స్ విషయంలో హీరోయిన్ శోభాశెట్టి మనస్సులో ఏముందో చూడాల్సి ఉంది.