ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.ముఖ్యంగా పూరి జగన్నాథ్(Puri Jagannath) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకున్న ఈ దర్శకుడు రీసెంట్ గా చేస్తున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు.

తన గత రెండు సినిమాలు కూడా డిజాస్టర్లు గా నిలవడంతో అతనితో సినిమాలు చేయడానికి ఏ స్టార్ హీరో కూడా ముందుకు రావడం లేదు.కానీ ఇప్పుడు మాత్రం విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తో పూరి ఒక భారీ సినిమాను చేయబోతున్నాడు అనే న్యూస్ అయితే బయటకు వచ్చింది.అయితే ఈ సినిమాలో విజయ్ ఇద్దరు పిల్లల తండ్రిగా నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఇలాంటి సందర్భంలో ఆయనతో పూరి ఎలాంటి సినిమా చేస్తున్నాడు.పూరి మార్క్ స్టైల్ చూపిస్తాడా లేదంటే డిఫరెంట్ స్టైల్లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు పూరి జగన్నాథ్(Puri Jagannadh) చేసిన సినిమాలన్నింటిలో హీరోకి సపరేట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది.

హీరో ఎవర్ని పట్టించుకోకుండా ఒక అనాధల ఉండే హీరో క్యారెక్టర్ ను రాయడంలో పూరి జగన్నాథ్ దిట్ట…మరి ఇప్పుడు విజయ్ సేతుపతి కోసం ఎలాంటి క్యారెక్టర్ ని రాశాడు.ఆయన చేయబోతున్న సినిమాల ద్వారా ఎలాంటి సక్సెస్ ను సాధించబోతున్నాడనేది తెలియాల్సి ఉంది…ఇక డిఫరెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకునే విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ కి డేట్స్ ఇస్తున్నాడు అంటే ఇందులో ఏదో ఒక కొత్త వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుందంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…