టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు.( Hari Hara Veeramallu ) ఈ సినిమా అప్పుడెప్పుడో మొదలైంది.
కానీ ఈ సినిమా మాత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.అని అనుకున్నట్టు సజావుగా జరిగి ఉంటే ఈ సినిమా ఎలక్షన్ల కంటే ముందే విడుదల కావాల్సి ఉంది.
కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా ఫుల్ బిజీ బిజీగా ఉండడం ఆ తర్వాత ఎలక్షన్స్ లో గెలిచి డిప్యూటీ సీఎం అవ్వడంతో ఫుల్ బిజీగా మారిపోయారు.దీంతో ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారు.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగానే ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా ఈ ఏడాది మే 9న విడుదల కావాల్సి ఉంది.
కానీ ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపుగా 70 శాతం వరకు షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తోంది.

పవన్ అటు ఇటుగా ఒక వారం రోజులు డేట్స్ కేటాయిస్తే మొత్తం సినిమా కంప్లీట్ అయిపోతుందట.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న పవన్ ఈ నెలలో ఎలాగైనా వీరమల్లుకి కాస్త సమయం కేటాయించి, చిత్రాన్ని పూర్తి చేయాలని భావించారు.కానీ ఇప్పుడు అది సాధ్యపడకపోవచ్చు.ఎందుకు అంటే తాజాగా సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్( Mark Shankar ) గాయపడిన సంగతి తెలిసిందే.
దీంతో పవన్ సింగపూర్ కి వెళ్ళారు.చేతులు, కాళ్ళకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులకు పొగ పట్టేయడంతో మార్క్ కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

దీంతో పవన్ కొద్ది రోజులు సింగపూర్ లోనే ఉంటారని సమాచారం.అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ ప్రభుత్వ కార్యకలాపాలతో బిజీ అవుతారు.మే 9 కి సరిగ్గా నెలరోజులే సమయముంది.ఒకవైపు ఆసుపత్రిలో కుమారుడు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు.ఇలాంటి సమయంలో పవన్ షూటింగ్ కోసం వారం రోజులు కేటాయించడం అసాధ్యమనే చెప్పాలి.నిర్మాతలు సైతం ఈ సమయంలో పవన్ దగ్గర షూట్ ప్రస్తావన తీసుకొచ్చే అవకాశమే లేదు.
ఈ లెక్కన మే 9కి వీరమల్లు వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ విషయంలో నిరాశ ఎదురయింది అని చెప్పాలి.
దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అసలు విడుదల అవుతుందా లేదా అంటూ అభిమానులు కాస్త మండిపడుతున్నారు.