ప్రైవేట్ ఉద్యోగులు( Private Employees ) ఎప్పటికప్పుడు ఉద్యోగాలు మారడం చాలా సాధారణం.అయితే, ఉద్యోగం మారినప్పుడు కొత్త కంపెనీ మీకు కొత్తగా ఒక EPF ( Employees Provident Fund ) ఖాతా ఓపెన్ చేస్తుంది.
కానీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మాత్రం మార్చబడదు.చాలా మంది ఉద్యోగులకు ఈ సమయంలో ఒక సందేహం కలుగుతుంది.
“UAN అదే కదా, మరి EPF ఖాతా కూడా ఒక్కటేనా?” అనే.కానీ నిజానికి, UAN ఒకటే అయినా, ప్రతి కొత్త ఉద్యోగానికి కొత్త PF ఖాతా ఓపెన్ అవుతుంది.
మీరు కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత మీ పాత UAN నంబర్‌ను కొత్త సంస్థకు ఇవ్వాలి.ఆ సంస్థ మీ UAN కింద మరో కొత్త PF ఖాతా ఓపెన్ చేస్తుంది.
అప్పటి నుండి, మీ EPF కాన్ట్రిబ్యూషన్స్ కొత్త ఖాతాలో చేరతాయి.ఈ సమయంలో మీరు తప్పనిసరిగా చేయవలసిన పని పాత PF ఖాతాను కొత్త ఖాతాతో మెర్జ్ చేయడం.
నిజానికి మీ పాత EPF ఖాతాను కొత్త ఖాతాతో కలపడం అనేది EPFO వెబ్‌సైట్ ద్వారా చాలా సులభం.అది ఎలా అంటే.

EPFO మెంబర్ సేవా పోర్టల్ ( https://unifiedportal-mem.epfindia.gov.in ) కు లాగిన్ అవ్వాలి.అక్కడ Online Services లోకి వెళ్లి ‘One Member – One EPF Account ( Transfer Request )’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.అక్కడ మీ వ్యక్తిగత వివరాలు, ప్రస్తుత కంపెనీ ఖాతా వివరాలను ధృవీకరించాలి.‘Get Details’ పై క్లిక్ చేస్తే పాత యజమానుల EPF ఖాతాల జాబితా కనిపిస్తుంది.ఆపై మీరు మెర్జ్ చేయాలనుకున్న పాత ఖాతాను ఎంచుకొని ‘Get OTP’ పై క్లిక్ చేయాలి.దానితో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPను ఎంటర్ చేసి ‘Submit’ చేయాలి.
ఇప్పుడు మీరు చేసిన రిక్వెస్ట్‌ను కొత్త కంపెనీ అప్రూవ్ చేసిన తర్వాత EPFO మీ పాత ఖాతాను కొత్తదానితో కలుపుతుంది.కొంత సమయం తరువాత మీ ట్రాన్స్ఫర్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.
అంతే చాలా సులువుగా మార్చుకోవచ్చు.

ఖాతాను మెర్జ్ చేయకపోతే వచ్చే నష్టాలు కూడా ఉంటాయి.పాత EPF ఖాతాను కొత్త ఖాతాతో కలపకపోతే ఎదురయ్యే నష్టాలు కూడా లేక పోలేదు.పాత ఖాతాలో ఉన్న డబ్బు వేరుగా చూపబడుతుంది.
మొత్తం కలిపి చూడలేరు.ఐదు సంవత్సరాల పాటు EPF ఖాతాలో డబ్బులు ఉండిన తర్వాత విత్‌డ్రా చేస్తే పన్ను మినహాయింపు ఉంటుంది.
కానీ ఖాతాలు కలపకపోతే ఈ ఐదేళ్ల కాలం వేర్వేరుగా లెక్కించబడుతుంది.దాంతో పన్ను మినహాయింపు నష్టమవుతుంది.
దానితో ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో స్పష్టత లేకుండా ఉంటుంది.
మొత్తానికి ఉద్యోగం మారిన ప్రతీసారి కొత్త EPF ఖాతా ఓపెన్ అయినా, మీరు మీ పాత ఖాతాను కొత్తదానితో కలిపే ప్రక్రియను తప్పక చేయాలి.
ఇది మీ భవిష్య భద్రతతో పాటు పన్ను ప్రయోజనాలను కూడా కాపాడుతుంది.ఇప్పుడు నుండే మీ EPF ఖాతాల స్టేటస్ చెక్ చేసి, అవి మెర్జ్ అయినాయో లేదో ధృవీకరించండి.