సమంత ( Samantha ) ప్రస్తుతం తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బిజీబిజీగా గడుపుతున్నారు.ఒకవైపు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారి కూడా సమంత కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఇక సమంత వ్యక్తిగత జీవితం సినీ జీవితం తెరిచిన పుస్తకం.ఈమె సినీ కెరియర్ పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే… స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత నటుడు నాగచైతన్యను( Nagachaitanya ) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లైన మూడు సంవత్సరాలకి విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా విడాకులు( Divorce ) తీసుకున్న నాగచైతన్య తిరిగి శోభిత( Sobhita )ను వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.కానీ సమంత మాత్రం ఇప్పటివరకు రెండో పెళ్లి చేసుకోలేదు.ఈమె త్వరలోనే ఒక డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.
వీరిద్దరూ విడాకులకు గల కారణాలను ఎక్కడ తెలియజేయలేదు.

తాజాగా నటి సమంత సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కు లైక్ చేశారు.దీంతో ఈమె విడాకులు తీసుకోవడానికి ఇదే కారణమా అంటూ చర్చలు జరుపుతున్నారు.ఇంతకీ సమంత లైక్ కొట్టిన ఆ పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే….
భార్య అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలేసుకోవడానికి మొగ్గుచూపుతాడు.కానీ భార్య మాత్రం భర్త అనారోగ్యానికి గురైన తనని విడిచి పెట్టాలనీ అనుకోదనీ ఉన్నటువంటి పోస్టుకు సమంత లైక్ కొట్టారు.
దీంతో సమంతకు అనారోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలోనే నాగచైతన్య ఈమెకు విడాకులు ఇచ్చారా అనే విషయంపై మరోసారి చర్చలు జరుగుతున్నాయి.