బరువు తగ్గాలంటే సరైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండ వ్యాయామం చేయాలి.బరువు తగ్గాలని అనుకొనే వారికి ఈ రెండు తప్పనిసరి.
సరైన ఆహార ప్రణాళిక లేనివారికి కొవ్వు తగ్గకుండా కొవ్వు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.అయితే ఇప్పుడు చెప్పే ఆహారాలు కొవ్వును వేగంగా కరిగిస్తాయి.
ఈ ఆహారాలను తీసుకుంటే చాలా తక్కువ సమయంలోనే కొవ్వు తగ్గించుకొని బరువు తగ్గవచ్చు.
ఎన్నో పోషక విలువలు ఉన్న గుడ్డును బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీరంలో కొవ్వును కరిగిస్తుంది.గుడ్డుకు కొవ్వును కరిగించి శక్తిగా మార్చే లక్షణం ఉంటుంది.అందువల్ల బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు తినటం అలవాటుగా చేసుకోవాలి.
విటమిన్ సి సమృద్ధిగా లభించే సిట్రస్ జాతి పండ్లు, నిమ్మ, ద్రాక్ష, బెర్రీలు, ఆరెంజస్ వంటి పండ్లు, కేరట్, కేబేజి, బ్రక్కోలి, యాపిల్, వాటర్ మెలన్ వంటి కూరలు పండ్లను రెగ్యులర్ గా తీసుకోవాలి.ఇవి శరీరంలో కొవ్వును కరించటమే కాకుండా కణాలలో అధికంగా ఉన్న నీటిని కూడా పీల్చి బరువు తగ్గిస్తాయి.
బాదం పప్పును ప్రతి రోజు తినాలి.బాదంలో ఉండే మంచి కొలస్ట్రాల్,ఫైబర్ శరీరంలో ఉన్న అనవసరపు కొవ్వును కరిగించటంలో సహాయపడుతోంది.అయితే రోజుకి 4 లేదా 5 బాదం పప్పులు తింటే చాలు.
టమోటాలకు కొవ్వును కరిగించే శక్తి ఉంది.
అందువల్ల టమోటాలను సలాడ్స్ గా చేసుకొని తింటే మంచిది.ఆకలి వేసినప్పుడు పచ్చి టమోటా తిన్నా పర్వాలేదు.