ప్రెగ్నెన్సీ టైమ్‌లో పొట్ట దుర‌ద‌కు కార‌ణాలేంటి.. ఎలా ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టాలి?

ప్ర‌తి మ‌హిళ‌కు త‌న జీవితంలో ప్రెగ్నెన్సీ( Pregnancy ) అనేది ఒక ముఖ్య‌మైన స‌మ‌యం.ఆ స‌మ‌యంలో శ‌రీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.

 Simple Tips To Prevent Belly Itching During Pregnancy Details, Pregnancy, Women-TeluguStop.com

అనేక అనుభ‌వాలు ఎదుర‌వుతాయి.అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట వద్ద దురద( Itchy Belly ) అనేది చాలా సాధారణమైన సమస్య.

ఆ దుర‌ద‌ను భ‌రించ‌లేక చాలా మంది పొట్ట‌ను గోక‌డం, రుద్ద‌డం చేస్తుంటారు.ఫ‌లితంగా పొట్ట‌డం గాట్లు ప‌డి శాశ్వ‌త మ‌చ్చ‌లుగా మారిపోతుంటాయి.

అస‌లు ప్రెగ్నెన్సీ టైమ్‌లో పొట్ట దుర‌ద‌కు కార‌ణాలేంటి.? ఎలా ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టాలి.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గ‌ర్భం దాల్చిన త‌ర్వాత బిడ్డ ఎదిగే కొద్ది పొట్ట పెరుగుతూ ఉంటుంది.

పొట్ట పెరగడం వల్ల చర్మం పొడిబారి, దురద కలిగించవచ్చు.గర్భధారణ సమయంలో ఎస్ట్రోజన్ స్థాయిలు మారుతాయి, ఇది దురదకు కారణమవుతుంది.

అలాగే వేడి నీటి స్నానం వ‌ల్ల చర్మం పొడిబారి దురద కలుగుతుంది.దుర‌ద‌కు గోక‌డ‌మే పరిష్క‌రం అనుకుంటే పొర‌పాటు.

ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టాలంటే క‌చ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

Telugu Aloevera Gel, Tips, Healthy Skin, Itchy Belly, Latest, Maternity Care, Oa

ముఖ్యంగా హైడ్రేట్ గా ఉండండి.నీరు ఎక్కువగా తాగండి.తేమను మెయింటెయిన్ చేయండి.

అందుకోసం నిత్యం చ‌ర్మానికి ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించండి.ఇవి పొడిబారిన చర్మాన్ని సాఫ్ట్ చేయడానికి సహాయపడతాయి.

పొట్ట దుర‌ద‌ను త‌గ్గిండ‌చంలో ఆలోవెరా జెల్( Aloevera Gel ) హెల్ప్ చేస్తుంది.ఆలోవెరా జెల్ చ‌ర్మానికి చల్లదనం ఇచ్చి, దురదను పోగొడుతుంది.

Telugu Aloevera Gel, Tips, Healthy Skin, Itchy Belly, Latest, Maternity Care, Oa

స్నానానికి వేడి వేడి నీరు కాకుండా గోరువెచ్చ‌ని నీటిని ఉప‌యోగించండి.హార్ష్ కెమికల్స్ లేకుండా ఉండే సబ్బులు లేదా బాడీ వాష్ ను వాడండి.దుస్తుల ఎంపిక‌లోనూ జాగ్ర‌త్త వ‌హించాలి.బిగుతైన దుస్తులు వేసుకుంటే గాలి ఆడ‌క దుర‌ద మ‌రింత పెరుగుతుంది.కాబ‌ట్టి గాలి ఆడేలా, చర్మానికి హాయిగా ఉండే కాట‌న్ దుస్తులు ధరించండి.

ఓట్స్ పౌడర్( Oats Powder ) ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇబ్బంది పెట్టే పొట్ట దుర‌ద‌ను నివారిస్తుంది.

రెండు టీ స్పూన్ల ఓట్స్ పౌడర్‌ని గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేస్తే, చర్మం మృదువుగా మారి దురద త‌గ్గుతుంది.హార్మోన్ల మార్పులతో వచ్చే దురదను నివారించ‌డంలో పుదీనా టీ తోడ్ప‌డుతుంది.

విటమిన్ ఇ, విట‌మిన్ సి సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోండి.ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, పొడిబారడాన్ని తగ్గిస్తాయి.

దుర‌ద‌కు అడ్డుక‌ట్ట వేస్తాయి.ఇక‌పోతే కొంద‌రిలో పొట్ట దుర‌ద అనేది సీరియస్ ప్రెగ్నెన్సీ కొలెస్టాసిస్ అనే లివర్ సంబంధిత సమస్యకు సంకేతమై ఉండొచ్చు.

కాబ‌ట్టి, అధికంగా దురద ఉన్నా, చర్మం ఎర్రగా, దద్దుర్లు ఏర్పడినా, దురదతోపాటు ఇతర సమస్యలు ఉన్నా వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube