పొడవాటి జుట్టు కోసం ఆరాటపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాను మీరు ట్రై చేయాల్సిందే!

సాధారణంగా చాలా మంది పొడవాటి జుట్టు( Long Hair )ను పొందాలని ఆరాటపడుతుంటారు.అయితే హెయిర్ గ్రోత్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మందికి ఆ కల కలగానే మిగిలిపోతుంది.

 Best Homemade Toner For Long Hair!, Homemade Toner, Hair Toner, Long Hair, Hair-TeluguStop.com

దాంతో ఎంతగానో దిగులు చెందుతుంటారు.అయితే ఇకపై అస్సలు వర్రీ అవ్వకండి.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా( Simple Tip )ను మీరు క‌నుక‌ ట్రై చేస్తే కొద్ది రోజుల్లోనే పొడవాటి జుట్టు మీ సొంతం అవ్వడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టును పొడుగ్గా మార్చే ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Care, Care Tips, Fall, Homemade, Long, Thick-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ మెంతులు, మూడు మందారం పువ్వులు( Hibiscus Flowers ), మూడు తుంచిన మందారం ఆకులు, మూడు రెబ్బలు కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాలు వేసి దాదాపు పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని కాస్త చల్లార బెట్టుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేస్తే ఓ‌ మంచి హెయిర్ టోనర్( Hair Toner ) సిద్ధం అవుతుంది.

ఈ హెయిర్ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Homemade, Long, Thick-Telugu Health

వారానికి రెండు సార్లు ఈ హెయిర్ టోనర్ ను వాడితే పొడవాటి జుట్టు పొందాలన్న మీ కోరిక కొద్ది రోజుల్లోనే నెరవేరుతుంది.జుట్టు పొడుగ్గా మరియు ఒత్తుగా పెరగడానికి ఈ హోమ్ మేడ్ హెయిర్ టోనర్ ఉత్తమంగా సహాయపడుతుంది.మరియు ఈ హెయిర్ టోనర్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

చుండ్రు సమస్య( Dandruff Problem ) ఉన్న సరే దూరం అవుతుంది.కాబట్టి పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటున్న వారు తప్పకుండా ఈ హెయిర్ టోనర్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube