హై బీపీ దీనినే అధిక రక్తపోటు అని కూడా అంటారు.రక్త పోటు స్థాయిలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటమే హై బీపీ.
నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని ఈ అధిక రక్త పోటు సమస్య వేధిస్తుంది.ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, ఒత్తిడి, ఆందోళన, ఊబకాయం, పలు రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల హై బీపీ సమస్య ఏర్పడుతుంది.
ఇక ఈ సమస్యను తగ్గించుకునేందుకు అందరూ ఎంచుకునే మార్గం ముందులు వాడటం.
అయితే న్యాచురల్‌గా కూడా అధిక రక్త పోటును అదుపు చేసుకోవచ్చు.
కొన్ని కొన్ని ఆహారాలు రక్త పోటును కంట్రోల్ చేయడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.అలాంటి వాటిలో నల్ల ఎండు ద్రాక్షలు కూడా ఉన్నాయి.
మిగిలిన ఎండు ద్రాక్షలతో పోలిస్తే నల్ల ఎండు ద్రాక్ష అద్భుతమైన రుచి కలిగి ఉండటమే కాదు పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, పొటాషియం, ప్రోటీన్, ఫైబర్, పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలు నల్ల ఎండు ద్రాక్షలో నిండి ఉంటాయి.అందుకే వీటిని డైట్‌లో చేర్చుకుంటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చని నిపుణులు చెబుతుంటారు.ముఖ్యంగా హై బీపీతో బాధ పడే వారు పది నల్ల ఎండు ద్రాక్షలను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
ఉదయాన్నే ఎండు ద్రాక్షలతో సహా వాటర్‌ను తాగేయాలి.ఇలా చేయడం వల్ల నల్ల ఎండు ద్రాక్షల్లో ఉండే పొటాషియం, ఫైబర్ రెండూ అధిక రక్త పోటు నియంత్రిస్తాయి.
ఇక నల్ల ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య దూరం అవుతుంది.గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.ఒంట్లో పేరుకున్న అధిక కొవ్వు కరుగుతుంది.చర్మం కూడా ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతివంతంగా ఉంటుంది.
కాబట్టి, హై బీపీ ఉన్న వారే కాదు అందరూ వీటిని తీసుకోవచ్చు.