తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇప్పటికీ మల్టీ స్టారర్ సినిమాల( Multi starrer movies ) హవా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కొనసాగుతున్న నేపధ్యం లో మరోసారి ఈ సినిమా తెరమీదికి వచ్చింది ఇప్పటికే రామ్ చరణ్ ,ఎన్టీఆర్ ఇద్దరు చేసిన త్రిబుల్ ఆర్ సినిమా భారీ సక్సెస్ ని సాధించి తెలుగు సినిమా స్టామినా ఏంటో ఇండియా సినిమా ఇండస్ట్రీ లో నిరూపించింది.
ఇక ఇప్పుడు దాంతో మరికొన్ని సినిమాలను కూడా అదే రేంజ్ లో తీసి సూపర్ సక్సెస్ లను సాధించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి.

ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు( Balayya Babu ) కొడుకు అయిన మోక్షజ్ఞ ( Mokshajna )తన మొదటి సినిమాని ప్రశాంత్ వర్మ ( Prashant Verma )డైరెక్షన్ లో చేయడానికి సిద్ధమయ్యాడు.ఇక తన రెండో సినిమా కోసం బాలయ్య బాబు మోక్షజ్ఞ ఇద్దరు కలిసి నటించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇది ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాగా రూపొందించి దీనిని సూపర్ సక్సెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బాలయ్య బాబు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తున్నారనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక మొత్తానికైతే బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో తన కొడుకుతో కలిసి భారీ మల్టీ స్టారర్ సినిమా చేస్తే చూడడానికి నందమూరి అభిమానులతో పాటు యావత్ ఇండియన్ సినిమా అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.