ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.57
సూర్యాస్తమయం: సాయంత్రం 05.58
రాహుకాలం: మ 02:58 నుంచి 04:28 వరకు
అమృత ఘడియలు: సా 04:57 నుంచి 06:42 వరకు
దుర్ముహూర్తం: ఉ 08:21 నుంచి 09:09 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి.ఆర్థికపరిస్థితులలో కొంత మెరుగుదల ఉంటుంది.మీ ఇంటి విషయంలో అందంగా అలంకరించడానికి ఇష్టపడతారు.ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని వృధా చేస్తారు .ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది ఎదురౌతుంది.
వృషభం:

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం పట్ల సమయంను వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి.అప్పుగా తీసుకున్న డబ్బులను చెల్లించడానికి ఇదే మంచి సమయం.మీ తోటి ఉద్యోగులకు నిర్ణయాలు ఇవ్వడంలో సహాయం చేయండి.నిర్ణయాలు ఇచ్చేటప్పుడు ఆలోచించి సలహాలు చెప్పండి లేదా మీరు బాధపడాల్సి ఉంటుంది.
మిథునం:

ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవడం మంచిది .మీ ఇంటికి ఈ రోజు అనుకోకుండా బంధువులు వచ్చే అవకాశం ఉంది.అనుకున్నదాని కంటే ముందే మీరు పనులు పూర్తి చేస్తారు.
మీ జీవిత భాగస్వామితో ఇంట్లో అభివృద్ధి కనిపిస్తుంది.ఒత్తిడికి లోనైనా మీరు మీ పనులను ఓపికతో చేస్తారు
కర్కాటకం:

ఈ రాశి వారికి ఈరోజు మీ కుటుంబ సభ్యులకి సంబంధించిన వారికి కి ఆరోగ్య సమస్య వస్తుంది.ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి విషయంలో మార్పు ఉండడంతో… ఆర్థిక పరిస్థితి విషయం పక్కనబెట్టి ఇంట్లో వారిని చూసుకోండి.వ్యాపార విషయంలో నష్టాలు వస్తాయి.
అయినప్పటికీ మీరు విచారించాల్సిన పనిలేదు.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కాస్త జాగ్రత్తగా ఉండండి.
సింహం:

ఈ రాశి వారికి ఈరోజు అంతా మంచే జరుగుతుంది.ఈరోజు మీ చేతికి ధనం వస్తుంది.మీ దగ్గర అప్పుగా తీసుకున్న వారి నుండి మీరు ఇవాళ డబ్బులు పొందుతారు.క్రొత్త ప్రాజెక్ట్ ల కోసం నిధుల అడుగుతారు.మీ ఖాళి సమయములో సమస్యలకు తగిన పరిష్కారము ఆలోచిస్తారు.మీ భాగస్వామి ఈ రోజు ఆనందాన్ని కలిగించే పనులు చేస్తారు.
కన్య:

ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది.ఈ రోజు మీరు చేసే పనులలో తక్కువ సమయంలోనే పూర్తి చేస్తారు.డబ్బు విషయంలో కొంచెం తొందర పాటుగా ఉంటారు.ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది.ఈరోజు దూర ప్రయాణాలు చేస్తారు.ఈ రోజు మీరు, మీ జీవిత భాగస్వామి సంతోషంగా గడుపుతారు.
తులా:

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది.ఆర్థిక పరిస్థితులు కొంత వరకు మెరుగుపడతాయి.కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు ఎప్పటి నుండో అనుకుంటున్న పని నెరవేరడంతో, సంతోషంగా ఉంటారు.మీ జీవిత భాగస్వామితో కలిసి పనులు చూసుకుంటారు.
వృశ్చికం:

ఈ రాశి వారికి ఈరోజు తమ బలాన్ని కోల్పోవడం తో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీభాగస్వామి మిగూర్చి బాగా ఆలోచిస్తారు.
మీ బలహీనత వల్ల ఇతరులపై క్షమాపణ కోరే అవకాశం ఉంది.మీరు మీ సమయాన్ని స్నేహితుడితో గడుపుతారు.మీ జీవిత భాగస్వామితో ఉన్న వివాదం ఈ రోజు కాస్త తీరిపోతుంది.
ధనస్సు:

ఈ రాశివారు ఈరోజు ఏదైనా నా పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.సంపాదించినా కూడా ఖర్చుల వలన దాచుకోలేకపోతారు.పెద్దవారి దగ్గర పని గురించి ఆకర్షించడానికి ఈరోజు సరియైనది.
ఖాళీ సమయంలో పని చేయడానికి ఇష్టపడతారు.భాగస్వామ్యంతో క్రొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి మంచి రోజు.
మకరం:

ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు నెరవేరుతాయి.ధనలాభాలు మీరు అనుకున్నంతగా ఉండవు.స్నేహితులు, బంధువులు, మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు.ఉద్యోగం కోసం ఏదైనా ఇంటర్వ్యూ కి వెళ్తే ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు.మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు.కానీ చివరికి మాత్రం తామే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు.
కుంభం:

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించాలి.కొత్తగా పెట్టుబడి పెట్టే వారికి అనుకూలంగా ఉంటుంది.మిమ్మల్ని ఇష్టపడేవారికి ఇవాళ బహుమతి ఇస్తారు.
మీ వైవాహిక జీవితం ఈ రోజు ఓ అద్భుతంగా ఉంది.ఆర్థిక విషయంలో కొంత మెరుగుదల కనబడుతుంది.
మీనం:

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి.మీకు ఉన్న సమస్యలను మీ కుటుంబ సభ్యులతో తెలపడానికి మంచి సమయం.ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇంట్లో పనులు చూసుకుంటారు.మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.