రుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర పర్యాటక, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు.వారికి ఆలయ ఏ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వాదం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాచనం చేసి అమ్మవారు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇంచార్జ్ సూపర్డెంట్ దాము, ఏ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాస్చార్యులు, ఏవీఎస్ఓ శైలేంద్ర బాబు, విఐ రామ్మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, అశోక్ ఆలయ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు.