గతేడాది అత్యధిక లాభాలను సొంతం చేసుకున్న సినిమా ఏదనే ప్రశ్నకు పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమా పేరు జవాబుగా వినిపిస్తుంది.ఈ సినిమా రికార్డ్ స్థాయిలో లాభాలను అందుకున్న సంగతి తెలిసిందే.
బన్నీ కెరీర్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.అయితే పుష్ప ది రూల్ సినిమాకు వచ్చిన లాభాలను చిన్న సినిమాల బడ్జెట్ రాయితీ కోసం వినియోగించాలని తెలంగాణ హైకోర్టులో( Telangana High Court ) పిల్ దాఖలైంది.
న్యాయవాది నరసింహారావు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడం జరిగింది.బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు వల్ల పుష్ప ది రూల్ సినిమాకు భారీగా ఆదాయం వచ్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
హోం శాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి మరీ బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇవ్వడానికి గల కారణాలు చెప్పలేదని న్యాయస్థానానికి న్యాయవాది వివరించారు.

సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని ఆయన కోరారు.సీజే ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల వసూలు ముగిసింది కదా అని ప్రశ్నించగా వాటి వల్ల వచ్చిన లాభం గురించి పిటిషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు.అందుకు తగిన విధంగా సుప్రీం కోర్టు కాపీ సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

పుష్ప ది రూల్ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.ఓటీటీలో సైతం ఈ సినిమా అంచనాలకు మించి హిట్ అయింది.బన్నీ( Bunny ) బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు సాధిస్తూ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.పుష్ప ది రూల్ మూవీపై దాఖలైన పిల్ విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.







