కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ( Mark Carney ) ఎన్నికయ్యారు.జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) రాజీనామాతో కెనడాలో కొత్త ప్రధానిని( Canada New PM ) ఎన్నుకోవాల్సి వచ్చింది.
అధికార లిబరల్ పార్టీ( Liberal Party ) సభ్యులు ఆయనను తమ కొత్త నేతగా ఎన్నుకున్నారు.ప్రధాని రేసులో మాజీ ఆర్ధిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ ఆయనకు గట్టి పోటీ ఇచ్చారు.
మొత్తం 1,50,000 మంది లిబరల్స్ ఓటింగ్‌లో పాల్గొనగా.కార్నేకు 1,31,674 మంది.క్రిస్టియా ఫ్రీలాండ్‌కు( Chrystia Freeland ) 11,134.కరీనా గౌల్డ్‌కు 4,785.
ఫ్రాంక్ బేలిస్‌కు 4,038 ఓట్లు వచ్చాయి.దాదాపు 85.9 శాతం ఓట్లు పొందిన కార్నీ .కెనడాకు 24వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.కార్నీకి ఇప్పటి వరకు రాజకీయంగా , కేబినెట్‌లో పనిచేసిన అనుభవం కానీ లేవు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ అగ్రరాజ్యాధినేతను కార్నీ ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ఎవరీ మార్క్ కార్నీ :
మార్క్ కార్నీ 1965 మార్చి 16న కెనడాలోని ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు.ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో చదువుకున్న కార్నీ.అనంతరం ప్రముఖ ఆర్ధిక సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్‌లో 13 ఏళ్ల పాటు పనిచేసి 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా ఎన్నికయ్యారు.2004లో ఆ పదవి నుంచి తప్పుకుని అనూహ్యంగా ఆర్ధిక మంత్రి పదవిని చేపట్టారు.తర్వాత 2008 ఫిబ్రవరి 1న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్‌గా నియమితులయ్యారు కార్నీ.

2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్ధిక సంక్షోభం సమయంలో పరిస్ధితిని చక్కదిద్దడానికి కృషి చేశారు.ఇక 2013లో 300 ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు గవర్నర్‌గా ఎన్నికయ్యారు కార్నీ.తద్వారా ఈ బ్యాంక్‌కు తొలి బ్రిటీషేతర గవర్నర్‌గా నిలిచారు.అలాగే జీ7లోని రెండు సెంట్రల్ బ్యాంక్‌లకు సారథ్యం వహించిన వ్యక్తిగా కార్నీ అరుదైన ఘనత సాధించారు.2020 వరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బాధ్యతలు చూసిన ఆయన అనంతరం ఐక్యరాజ్యసమితిలో ఫైనాన్షియల్, క్లైమేట్ ఛేంజ్ విభాగం రాయబారిగా పనిచేశారు.







