Traveling : ప్ర‌యాణ సమయంలో తినదగ్గ ఉత్తమమైన ఆహారాలు ఇవే!

ఇంట్లో ఉంటే ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.ఆహారం విషయంలో అనేక నియమాలు పాటిస్తారు.

కానీ జర్నీ సమయంలో మాత్రం వాటిని వదిలేస్తారు.మనలో చాలా మందికి ప్రయాణం చేయడం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది.

ఆ ఇష్టంతోనే తరచూ ఏదో ఒక చోటకి ప్రయాణిస్తూ ఉంటారు.అయితే బస్సు, కార్, ఫ్లైట్ తదితర వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత మందికి వాంతులు, వికారం, తల తిరగడం వంటి లక్షణాలు కలుగుతాయి.

దీనిని మోషన్ సిక్‌నెస్ అంటారు.అందుకే జర్నీ చేయాలనుకున్నప్పుడు ముందస్తు ప్లానింగ్ ఎంతో అవసరం.

Advertisement

ముఖ్యంగా జర్నీ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.? ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి.? వాటి విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.చాలామంది కడుపు నిండా తిని జర్నీ ప్రారంభిస్తుంటారు.

కానీ ఇలా చేయడం వల్ల వాంతులు, వికారం లాంటి సమస్యలు తలెత్తుతాయి.జర్నీ సమయంలో లైట్ గా మాత్రమే ఫుడ్ ను తీసుకోవాలి.

జర్నీ సమయంలో తినదగ్గ ఆహారాల్లో పోహా( Poha ) ఒకటి.ఇది త్వరగా జీర్ణం అవుతుంది.కడుపును లైట్ గా ఉంచుతుంది.

అలాగే ప్రయాణ సమయంలో ఫ్రూట్స్ చాట్ ను తీసుకోవచ్చు.యాపిల్, దానిమ్మ, బొప్పాయి, అవకాడో తదితర పండ్లతో చాట్ తయారు చేసుకునే తీసుకోవడం వల్ల జర్నీ సమయంలో మంచి రిఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఎంతో హుషారుగా ఉంటారు.పైగా ఫ్రూట్ చాట్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

Advertisement

జర్నీ సమయంలో మసాలా మొక్కజొన్న తినవచ్చు.మొక్కజొన్న లో పోషకాలు మెండుగా ఉంటాయి.తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి.

శనగలు చాట్, స్ప్రౌట్స్ సలాడ్ వంటి ఆహారాలను కూడా ప్రయాణ సమయంలో తీసుకోవచ్చు.ఇక వేటికి దూరంగా ఉండాలి అంటే.

ఫ్రైడ్ ఫుడ్స్, మాంసాహారం, మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, హెవీ మీల్స్ వంటి ఆహారాలను ప్రయాణ సమయంలో నివారించాల్సిన ఉంటుంది.వీటి వల్ల వికారం వాంతులతో పాటు జీర్ణ సమస్యలు( Digestive problems ) తలెత్తుతాయి.

గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తాజా వార్తలు