ఉల్లిపాయ.కోసేటప్పుడు కన్నీరు పెట్టించినా ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తుంది.ఉల్లిపాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.అవి ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తారు.ఇక ఉల్లిపాయలతో టీ కూడా తయారు చేసుకుని సేవిస్తుంటారు.సాధారణంగా ఉదయం లేవగానే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది.
అయితే ఉల్లిపాయ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.మరి ఉల్లిపాయ టీ ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చుతుంది అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా జలుబు, తగ్గు, గొంతునొప్పి, నార్మల్ జ్వరం సమస్యలు వచ్చిన వారు వెంటనే మందులు వేసేసుకుంటారు.కానీ, ప్రతి రోజు ఓ కప్పు ఉల్లి టీ సేవిస్తే.
అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, ముక్కు కారవడం, తుమ్ములు వంటి సమస్యలను సులువుగా నివారిస్తుంది.అయితే రోజుకు ఒక కప్పు మించి ఉల్లి టీ తాగరాదు.
ఉల్లిపాయ టీ తో మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.ప్రతి రోజు ఓ కప్పు ఉల్లి టీ తాగడం వల్ల.అందులో ఉండే విటమిన్ సి మరియు కొన్ని పోషకాలు శరీర రోగ నిరోధక శక్తి బలపరిచి.సీజనల్‌గా వచ్చే జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది.అలాగే రక్త పోటును అదుపు చేయడంలో ఉల్లిపాయ టీ గ్రేట్‌గా సహాయ పడుతుంది.కాబట్టి, రక్తపోటు సమస్య ఉన్న వారు ప్రతి రోజు ఓ కప్పు ఉల్లిపాయ టీ సేవించడం ఉత్తమం.
ఇక తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు ఉన్న వారు కూడా ఓ కప్పు ఉల్లిపాయ టీ తాగితే.మంచి ఉపశమనం లభిస్తుంది.ఇంతకీ, ఉల్లిపాయ టీ ఎలా తయారు చేయాలంటే.ఒక గ్లాస్ నీటిలో ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా మరిగించాలి.ఆ తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక బిర్యానీ ఆకు వేసి మరికాసేపు మరిగించి.వడకట్టు కోవాలి.
ఈ నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకుంటే సేవిస్తే సరిపోతుంది.