హెయిర్ ఫాల్, డ్రై హెయిర్.‌. రెండు సమస్యలకు చెక్ పెట్టే మాస్క్ మీ కోసం..!

జుట్టు రాలడం( hair loss ) అనేది అందరూ ఎదుర్కొనే కామ‌న్ సమస్య.అలాగే డ్రై హెయిర్( Dry hair ) తో కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.

 A Mask That Checks Hair Fall And Dry Hair! Hair Fall, Dry Hair, Hair Care, Hair-TeluguStop.com

అయితే హెయిర్ ఫాల్ మరియు డ్రై హెయిర్ ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టే ఎఫెక్టివ్ హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఒకటి ఉంది.మరి ఆ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు ఏ విధంగా ఉపయోగించాలి.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక అవకాడో ( Avocado )తీసుకుని సగానికి కట్ చేసి గింజ తొలగించి పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో అవకాడో పల్ప్ వేసుకోవాలి.

అలాగే ఒక ఎగ్ ( Egg )ను బ్రేక్ చేసి అందులో వేసుకోవాలి.చివరిగా రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్( Olive oil ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మాస్క్ అనేది రెడీ అవుతుంది.

Telugu Fall Dry Fall, Avocado Egg, Avocadoegg, Dry, Care, Care Tips, Healthy-Tel

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ అవకాడో ఎగ్ మాస్క్ తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా అవకాడో, గుడ్డు, ఆలివ్ ఆయిల్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టులో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి, జుట్టును మృదువుగా మరియు మెరిసేలా చేస్తాయి.

పొడి జుట్టు సమస్యను నివారిస్తాయి.

Telugu Fall Dry Fall, Avocado Egg, Avocadoegg, Dry, Care, Care Tips, Healthy-Tel

అలాగే ఈ అవకాడో ఎగ్ మాస్క్ జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తుంది.జుట్టు రాలడాన్ని, విరగడాన్ని నిరోధిస్తుంది.అవకాడోలు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి జుట్టును రక్షించడంలో తోడ్పడతాయి.

అంతేకాకుండా ఈ అవకాడో ఈ ఎగ్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు దట్టంగా పెరుగుతుంది.కురులు స్ట్రాంగ్ అండ్ షైనీగా సైతం మారతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube