తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది యంగ్ డైరెక్టర్స్ కొత్త సినిమాలను చేస్తూ మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు.ఇక ప్రస్తుతం ఉన్న రోజుల్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మరి కొంతమంది సినిమాలను సైతం డైరెక్షన్ చేసే స్థాయి కి ఎదుగుతున్నారు…ప్రస్తుతం ఇన్ యంగ్ డైరెక్టర్స్ కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు… ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది యంగ్ డైరెక్టర్లు మొదట షార్ట్ ఫిలిమ్స్ తీసి ఆ తర్వాత సినిమా దర్శకులుగా మారినవారు కావడం విశేషం…
ఇక ఈ తరహాలోనే మరి కొంతమంది కూడా అదే బాటలో నడుస్తూ ఎప్పటికైనా తమ లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే మంచి కాన్సెప్ట్ తో వచ్చి యూట్యూబ్ ను ప్రేక్షకులను మెప్పిస్తున్న షార్ట్ ఫిల్మ్స్ ఎంతో ఒకసారి తెలుసుకుందాం.సాయి రోహిత్ దర్శకత్వంలో ‘ప్రయత్నం’( Prayatnam ) అనే ఒక షార్ట్ ఫిలిం తెరుకెక్కింది.
ఈ షార్ట్ ఫిలిం యొక్క గొప్పతనం ఏంటి అంటే మనిషి యొక్క గొప్పతనం ఏంటి? ఆకలి యొక్క విలువ ఏంటి అనేది ఇందులో చాలా స్పష్టంగా తెలియజేశారు.షార్ట్ ఫిలిం మొత్తం ఎమోషనల్ గా ఉండటమే కాకుండా ఒక మెసేజ్ కూడా ఉంటుంది.ఇక ఈ షార్ట్ ఫిలిం కి యూట్యూబ్ లో చాలా మంచి ఆదరణ అయితే దక్కుతుంది…

దొర సాయి రాజు నటిస్తూ దర్శకత్వం వహించిన ‘యాదవ్ ‘( Yadav ) అనే షార్ట్ ఫిలిం కూడా ఈ జనరేషన్ లో యాదవ్స్ అనే ఒక క్యాస్ట్ కి చెందిన కుర్రాళ్ళు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తద్వారా వాళ్లు ఎలా తమ మనుగడను కొనసాగిస్తున్నారు అనేది చాలా కామెడీ వే లోనే ప్రజెంట్ చేస్తూ ఎమోషనల్ టచ్ ఇస్తు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా అయితే ఉంది.మరి ఈ షార్ట్ ఫిలిం మంచి వ్యూయర్షిప్ ని దక్కించుకుంటుంది…

‘గాజుల పవన్ కుమార్ ‘ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తార ‘( Tara ) అనే షార్ట్ ఫిల్మ్ సైతం ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉంది.ఒక ఆకతాయి కుర్రాడు పని పాట లేకుండా తిరుగుతూ ఉన్న వ్యక్తిని ఒక అమ్మాయి ఎలా మార్చింది.తన వల్ల ఆ అబ్బాయికి జాబ్ ఎలా వచ్చింది?ఆమె ఎందుకని ఆ అబ్బాయికి హెల్ప్ చేసింది? అసలు ఈ ఫిల్మ్ టైటిల్ కి, ఆ అమ్మాయికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలను ఈ షార్ట్ ఫిలిం లో చాలా చక్కగా చూపించారు.కొంచెం లెంత్ ఎక్కువైనప్పటికి ఎక్కడ బోర్ లేకుండా ప్రేక్షకుడిలో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేస్తూ ముందుకు సాగింది.
సీన్ కి సీన్ కి మధ్య ఫ్లో కూడా బాగా సెట్ అయింది.మరి ఏది ఏమైనా కూడా ఈ షార్ట్ ఫిలిం సైతం ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది… పెద్దగా హడావిడి లేకుండా చాలా లో బడ్జెట్ లోనే ఈ షార్ట్ ఫిలిం చాలా చక్కగా తెరకెక్కించారు…