ఈ పవర్ ఫుల్ ఆయిల్ తో జీరో హెయిర్ ఫాల్ పొందొచ్చు.. తెలుసా?

హెయిర్ ఫాల్ సమస్య( Hairfall Problem )తో తీవ్రంగా సతమతం అవుతున్నారా.? కురులు రోజురోజుకు పల్చగా మారుతున్నాయా.? జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ తో జీరో హెయిర్ ఫాల్ మీ సొంతం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టు రాలడాన్ని అరికట్టే ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

 Powerful Oil For Zero Hair Fall!, Hair Oil, Zero Hair Fall, Stop Hair Fall, Hair-TeluguStop.com
Telugu Care, Care Tips, Fall, Oil, Thick, Zero Fall-Telugu Health

ముందుగా ఒక ఉల్లిపాయ( Onion )ను తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్‌ కొబ్బరి నూనె వేసుకోవాలి.ఆయిల్ హీట్ అవ్వడానికి ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెండు రెబ్బలు కరివేపాకు, ప‌ది తులసి ఆకులు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ), వన్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసుకొని స్లో ఫ్లేమ్ పై పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ త‌ర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయిన అనంతరం స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం కలిపి ఒక బాటిల్ లో నింపి స్టోర్ చేసుకోవాలి.

స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఆయిల్ ను అప్లై చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు మైల్డ్‌ షాంపూతో తల స్నానం చేయాలి.

Telugu Care, Care Tips, Fall, Oil, Thick, Zero Fall-Telugu Health

ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.దాంతో జుట్టు రాలడం క్రమంగా త‌గ్గుముఖం పడుతుంది.హెయిర్ ఫాల్ సమస్యను నివారించడానికి ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.అలాగే జుట్టును ఒత్తుగా మరియు పొడుగ్గా పెరిగేలా చేస్తుంది.అంతేకాదు ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.వయసు పైబడిన సరే తెల్ల జుట్టు( White Hair ) రాకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube